11న ఏకపాత్రాభినయ పోటీలు
ఒంగోలు మెట్రో: జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రతినెలా రెండో శనివారం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీల కరపత్రాలను మంగళవారం ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కే.వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. కార్యక్రమ వివరాలను జిల్లా రంగభూమి సంఘ ప్రతినిధులు తెలియజేశారు. 11వ తేదీ రెండో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు (వీరబాహుడు, దుర్యోధనుడు, హరిశ్చంద్ర) పాత్రలకు సంబంధించిన పోటీలు జరుగుతాయని, అనంతరం రాత్రి ఏడు గంటలకు బహుమతి ప్రదాన సభ నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, కోశాధికారి ధేనువకొండ సుబ్బయ్య, సభ్యురాలు ఏల్చూరి అనంతలక్ష్మి, శేషరత్నం, వాకా సంజీవరెడ్డి, దిగ్విజయ్, యం.వి.వి.పి.బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment