సాధన ఇండియా సైన్స్ ఫెయిర్‌కు జాబిల్లి జిలుగులు
ఒంగోలు సిటీ: ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు పాండిచ్చేరిలో జరిగే సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్ కి జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు ఎంపికై నట్లు డీఈఓ కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విజయవాడలో ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌లో జిల్లా నుంచి ఆరు ప్రాజెక్టులు పాల్గొన్నట్లు తెలిపారు. వీటిలో ఒకటి టీచర్ ఎగ్జిబిట్ కింద ‘జాబిల్లి జిలుగులు’ ప్రాజెక్టు, వ్యక్తిగత ఎగ్జిబిట్ కింద ‘స్మార్ట్‌పోల్’ ప్రాజెక్టు ఎంపికయ్యాయన్నారు. ఎంపికై న విజేతలను డీఈఓ కిరణ్‌కుమార్, డిప్యూటీ డీఈఓ చంద్రమౌళేశ్వరరావు, జిల్లా సైన్స్ అధికారి టి.రమేష్ అభినందనలు తెలిపారు. పాండిచ్చేరి లో జరిగే సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్ కు 35 ప్రాజెక్టులు ఎంపిక కాగా, ఇందులో జిల్లాకు చెందినవి రెండు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలిపారు.
టీచర్ ప్రాజెక్టు..
ప్రాజెక్టు పేరు: జాబిల్లి జిలుగులు (చంద్రయాన్–3)
స్కూల్ పేరు: ఈదుమూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నాగులుప్పలపాడు మండలం.
ప్రాజెక్టు సారాంశం:
ఇస్రో వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రయాన్–3 ప్రయోగంలో ఏం కనుగొన్నారు, వాటి ప్రయోజనం, వాటి వివరణలు గురించి తెలుసుకోవడం.
● చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అవడం
● ల్యాండర్, రోవర్‌లు చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేసి మనకు పేలోడ్ల ద్వారా ప్లాస్మా కొలత, సాంధ్రతల గురించి, ఉష్ణోగ్రతలో మార్పులు, సల్ఫర్ గుర్తింపు, వాటితో పాటు మిగిలిన మూలకాలు ఉన్నట్లు గుర్తించడం.
● చంద్రుని పైన జరిగిన మార్పులకు ఇస్రో వాళ్లకు నివేదికను సమర్పించడం.
వ్యక్తిగత ఎగ్జిబిట్:
ప్రాజెక్టు పేరు: ‘స్మార్ట్ పోల్’
గైడ్ టీచర్: పి.శ్రీలక్ష్మీ కామేశ్వరి
విద్యార్థిని పేరు: డి.కీర్తన, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, మార్కాపురం
స్మార్ట్‌పోల్ సారాంశం:
స్మార్ట్‌పోల్ అంటే సాధారణంగా ఉపయోగించే వీధిదీపాల స్తంభాల స్థానంలో సౌరశక్తిని ఉపయోగించి పనిచేసే ఎల్‌ఈడీలు, వైఫై రూటర్, సర్వైలెన్స్ కెమెరాలు, డిజిటల్ సైన్‌బోర్డులు, వాతావరణ సెన్సార్లు, ప్రజలను అప్రమత్తం చేసే స్పీకర్లు, విద్యుత్ తో నడిచే వాహనాలకు ఛార్జర్లు కలిగి ఉన్న స్తంభాలను ఏర్పాటు చేయాలి.
ఉపయోగాలు:
● పట్టణాల్లో అన్ని రకాల పరికరాలను ఒకే కేంద్రీకృత వ్యవస్థతో అనుసంధానం చేయడం వల్ల పౌర సేవలను వేగవంతం చేయవచ్చు.
● రవాణా వ్యవస్థను సమర్ధవంతంగా చేయవచ్చు.
● కార్బన్ డైఆకై ్సడ్ ఉద్ఘారాలను తగ్గించవచ్చు.
● పల్లెల్లో కూడా వాతావరణ సెన్సార్లను వ్యవసాయ రంగంలో ఉపయోగించవచ్చు.
● ఎలక్ట్రిక్ కార్లు, బైకులను రోడ్డుపైనే చార్జింగ్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment