ముగ్గురికి ప్రత్యేక బడి అవసరమా అండి!
చిత్రంలో కనిపిస్తున్నది కురిచేడు మండలం ఆవులమంద పంచాయతీ పరిధిలోని ముష్ట్ల గంగవరం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. తరగతి గదిలో ముగ్గురు విద్యార్థులే ఉన్నారేంటి అని ఆశ్యర్యపోకండి. హాజరు పట్టికలో మాత్రం ఆరు పేర్లుంటాయిలెండి. ఈ ముగ్గురు చిన్నారులకు పాఠాలు బోధించేందుకు ఒక ఉపాధ్యాయుడు, మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకురాలు పనిచేస్తున్నారు. కేవలం ముగ్గురు విద్యార్థులకు పాఠాలు బోధించడానికి ఆ ఉపాధ్యాయుడు సైతం ఇబ్బంది పడుతున్నారు. రూ.లక్షల రూపాయల ప్రజా ధనం వృథా చేసేకన్నా ఆ ముగ్గురిని సమీపంలోని మరో పాఠశాలకు పంపితే బాగుంటుందన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది. విద్యార్థుల సంఖ్య తగినంత లేని పాఠశాలలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాల్సిన విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలొస్తున్నాయి. కాగా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న పాఠశాలలను సమీపంలోని స్కూళ్లలో విలీనం చేస్తే కూటమి నేతలు ఏదో జరిగిపోతోందని గగ్గోలు పెట్టారు. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతారో? – కురిచేడు
Comments
Please login to add a commentAdd a comment