దాతలారా.. దయచూపుతారా..
● అంధత్వ సమస్యతో బాధపడుతున్న దంపతులు
● గుండె జబ్బుకు వైద్యం చేయించుకుంటున్న ఇజ్రాయేల్
● భార్యకు దీర్ఘకాలిక వ్యాధులతోపాటు మందగించిన చూపు
● దాతల సహకారం కోసం దీనంగా ఎదురుచూపులు
దర్శి: దర్శిలో దేవుని పరిచర్యలు చేస్తూ జీవనం సాగించే కోలా ఇజ్రాయేల్ నాలుగేళ్ల వయసులోనే చూపు కోల్పోయాడు. తన 12 ఏట నుంచి బైబిల్ వాక్యాలు చెబుతూ పూర్తిగా దేవుడి పరచర్యకు అంకితమయ్యాడు. ఈ క్రమంలో విశ్వాసులు అందించే కానుకల్లో ఖర్చులకు కొంత డబ్బుపోనూ మిగిలిన సొమ్మును సామాజిక సేవలకు ఉపయోగిస్తూ వస్తున్నాడు. 2019లో మేరీ అనే మహిళను వివాహం చేసుకుని శివరాజనగర్‌లోని వికలాంగుల కాలనీలో నివాసం ఉంటున్నాడు. అంధుడైన ఇజ్రాయేల్‌కు భార్య మేరీ చేదోడు వాదోడుగా నిలిచింది. ఈ తరుణంలో ఇజ్రాయేల్‌కు గుండె సంబంధిత సమస్య రావడంతో వైద్యుల సూచన మేరకు మాత్రలు మింగుతూ వస్తున్నాడు. అందుకుగాను ప్రతి నెలా రూ.10 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. భార్య మేరీకి ప్రస్తుతం పూర్తిగా కంటి చూపు మందగించింది. దీర్ఘకాలిక రుగ్మతల బారినపడిన ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. కంటి చూపు రావాలంటే ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.50 వేలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఈ అంధ దంపతులు హతాశులయ్యారు. ఇద్దరూ కళ్లు కనిపించని వారు కావడంతో రోజూ కష్టాలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పోషణ కూడా కష్టంగా మారింది. వీరికి బంధువులు, కుటుంబ సభ్యులు లేకపోవడంతో తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైద్య సహాయం అందించే దాతల కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. సాయం చేసేవారు 9959114931ను సంప్రదించాలని దీనంగా వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment