బాలికలు అన్నీ రంగాల్లో రాణించాలి
● బేటి బచావో–బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు అర్బన్: బాలికలు అన్నీ రంగాల్లో రాణించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా కోరారు. ప్రకాశం భవనం వద్ద జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం బేటీ బచావో–బేటీ పడావో ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సైకిల్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో విద్యార్థులతో పాటు కలెక్టర్ సైతం సైకిల్ తొక్కి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి విజయవంతం చేయాలన్నారు. బాలికలు ఉన్నతంగా రాణించేందుకు అన్నీ ప్రభుత్వ, ప్రభుత్వయేతర సంస్థలు చొరవ చూపాలన్నారు. ప్రజలు కూడా సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. బాలికలు అభివృద్ధి చెందితే, కుటుంబ వ్యవస్థ తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం విద్యార్థులందరూ మానవహారంగా ఏర్పడి బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్, బాల్య వివాహ రహిత జిల్లా చేయాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ చిన్న ఓబులేసు, ఐసీడీఎస్ పీడీ హెనసుజన్, బాలల సంరక్షణ అధికారి దినేష్‌కుమార్, సీడీపీవోలు, సూపర్‌వైజర్‌లు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment