ఎయిర్‌పోర్ట్ కోసం స్థల పరిశీలన
కొత్తపట్నం: మండలంలో ఎయిర్‌పోర్ట్ స్థల పరిశీలన కోసం బుధవారం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ టీమ్ వారు బుధవారం పరిశీలించారు. ఆలూరు, అల్లూరు గ్రామ పరిధిలో ఉన్న సర్వే నంబర్లను పరిశీలించారు. అల్లూరు 1700 నుంచి 1800, ఆలూరు 590 నుంచి 600 వరకు సర్వే నంబర్లలో 657 ఎకరాల పొలాలను పరిశీలించారు. వరదలు ఎంత ఎత్తులో వస్తాయి..వాతావరణం ఎలా ఉంటుంది..ఎప్పుడూ ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది.. ఏడాదిలో వర్షపాతం ఎలా ఉంటుంది.. తుఫాన్‌లు ఎలా వస్తాయి, సముద్రం ఎంత దూరంలో ఉందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివరాలన్నీ రాతపూర్వకంగా ఇవ్వాలని ఆర్డీవో లక్ష్మీప్రసన్నను ఆదేశించారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు మాట్లాడుతూ ఈ సర్వే నంబర్లలో అనుకూలంగా లేకపోతే పక్కకు మార్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందాన్ని కోరారు. ఇవి అన్నీ పూర్తి స్థాయిలో పరిశీలించి ఈ భూమి పనికొస్తుందా పనికిరాదా, లేక పక్కకు మార్చాలా అవి అన్ని పరీక్షలు చేసిన తరువాత నివేదిక పంపుతామని కేంద్రం బృందం స్పష్టం చేశారు. వారివెంట ఎయిర్‌పోర్ట్ టీమ్ జేజీఎమ్ సీఎన్‌ఎస్, ఏఏఐ ఏఎస్‌ఎన్ మూర్తి, డీజీఎం ఇంజినీరింగ్ సివిల్ ప్రవింద్ తీవారి, ఏ.ఎం.ఏఏఐ ఆర్టికల్చర్ ఆమాన్, ఏజీఎం ఇంజినీరింగ్ సివిల్ అరుణ్ కుమార్, ఏఏఐ మేనేజర్లు షాఅబుల్స్, ఉస్మాన్, తహసీల్దార్ పి.మధుసూదన్‌రావు, సర్వేయర్ సుధీర్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment