వందేమాతరం శ్రీనివాస్‌కు అక్కినేని అవార్డు
ఒంగోలు మెట్రో: పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 11వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం రాత్రి ఒంగోలులోని సీవీఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో అక్కినేని కళాపరిషత్ అధ్యక్షుడు కళ్లగుంట కృష్ణయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అవార్డు–2025ను ప్రదానం చేశారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ లు ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను ఘనంగా సన్మానించారు. నగరంలోని పలువురు ప్రముఖులు, కవులు, కళాకారులు, సాహిత్య, సంగీత కళాసంస్థల ప్రతినిధులు, అక్కినేని అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment