ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లా బాస్కెట్‌బాల్ బాలబాలికల జట్ల ఎంపిక ఈనెల 25న నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వలేటి రవీంద్ర, తొట్టెంపూడి సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కందుకూరులోని టీఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో మధ్యాహ్నం 2 గంటలకు ఎంపిక జరుగుతుందన్నారు. అండర్ 23 విభాగంలో 2002 జనవరి 1వ తేదీ, ఆ తరువాత పుట్టిన వారు మాత్రమే ఎంపికలో పాల్గొనేందుకు అర్హులు. ఎంపికై న క్రీడాజట్లు ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్ కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తమ వెంట తీసుకురావాలి. పూర్తి వివరాలకు సెల్ నెంబర్ 9866126955 లేదా 9963647799లను సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment