బాలికల ఉన్నత భవిష్యత్తు అందరి బాధ్యత
ఒంగోలు అర్బన్: బాలికల ఉన్నత భవిష్యత్తు మనందరి బాధ్యత అని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఆ దిశగా జిల్లాలో బంగారు బాల్యం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. బాలల హక్కులు చట్టాలపై శుక్రవారం గ్రీవెన్స్ హాలులో ఎంపీడీఓలు, ఎంఈఓలు, సీడీపీఓలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌లకు డివిజన్ స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను నివారించి బాలికల సాధికారత దిశగా ఎదిగేలా బంగారు బాల్యం కార్యక్రమం రూపకల్పం చేసినట్లు తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలన, పోషకాహర లోపం స్థాయి నుంచి బాలల బంగారు భవిష్యత్తుకు ప్రథమ స్థానంలో జిల్లా ఉండేలా మార్పు తీసుకురావడం అవసరమన్నారు. జిల్లాలో ప్రతి స్కూల్‌లో ఒక టీచర్‌ను నోడల్ అధికారిగా నియమించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. బాల్య వివాహాల పట్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. పారిశ్రామికీకరణలో భాగంగా జిల్లాలో లభించే ఉపాధి అవకాశాలను సమర్ధంగా అందిపుచ్చుకునే స్థాయికి మానవ వనరులను బాలికలను కూడా సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి మహిళా పోలీసు వారి పరిధిలో ఉన్న బాలికల వివరాలతో ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా తమవంతు బాధ్యత వహిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్, డీసీపీఓ దినేష్‌కుమార్, ఆర్‌డీఓ లక్ష్మీప్రసన్న, డీఎల్‌డీఓ మహాలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ రవికుమార్, జిల్లా విద్యా శిక్షణా సంస్థ ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు, సార్డ్స్ ప్రతినిధి సునీల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
బాల్య వివాహాల నివారణకు చేయి చేయి కలుపుదాం బంగారు బాల్యం కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా
Comments
Please login to add a commentAdd a comment