No Headline
కరెంటు బిల్లులే కాదు..భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు ప్రజలకు షాక్ ఇస్తున్నాయి. రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మోతమోగిస్తోంది. మార్కెట్ విలువలను ఒకటి, రెండు శాతం కాదు ఏకంగా 15 నుంచి 20 శాతం వరకు పెరగనున్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి వారికి సొంతింటి కల మరింత
భారంగా మారనుంది. సెంటో, రెండు సెంట్లో కొనుక్కొని రిజిస్ట్రేషన్
చేయించుకుందామనుకున్న ఆశలు ఆడియాసలుగా మారనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత కుదేలు కానుంది. శనివారం నుంచి అమలులోకి రానున్న కొత్త చార్జీలతో జిల్లా
వాసులపై సుమారు రూ.60 కోట్ల మేర అదనపు భారం పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment