ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూముల మార్కెట్ విలువలు పెరుగుతాయని ప్రభుత్వం ప్రకటించటంతో రెండు రోజులుగా జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. సాధారణంగా రోజులకు సరాసరి 250 నుంచి 350 వరకు స్థిరాస్థి డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యేవి. అలాంటిది జనవరి 30వ తేదీ ఒక్కరోజులోనే 682 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. సర్వర్లు మొండికేయకుండా సజావుగా సాగి ఉంటే 1000కు పైగా రిజిస్టర్ పూర్తయ్యేవి. శుక్రవారం చివరి రోజు
కావడంతో రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రజలు ఎగబడ్డారు. దాంతో చివరి రోజు 1000 మార్కు రిజిస్ట్రేషన్లు దాటవచ్చని అధికారులు అంచనాలు వేస్తున్నారు. జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ జనం బారులు తీరారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారు ఇప్పటికిప్పుడు స్థిరాస్థిని కొనుగోలు చేసుకున్న వారు కాదు. గతంలో కొనుగోలు చేసుకొని అగ్రిమెంట్ల మీద ఉన్నవారు మార్కెట్ విలువలు పెరిగితే భారం పెరుగుతుందని భావించి ఇప్పుడు వచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment