జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభం
సిరిసిల్లక్రైం: జిల్లాలో నూతనంగా నిర్మించిన పోలీస్ కార్యాలయాన్ని బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడ పర్యటనలో భాగంగా వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం మంత్రులు, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పూజలు నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ నూతన కార్యాలయంలో ఆసీనులు కాగా మంత్రులు, డీజీపీ పుష్పగుచ్ఛం అందించి శాంతిభద్రతలను కాపాడాలని సూచించారు. అనంతరం డీజీపీ జితేందర్ మీడియాతో మాట్లాడుతూ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ విశాలమైన వాతావరణంలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని అద్భుతంగా నిర్మించిందని వెల్లడించారు. త్వరలోనే ఎస్పీ నివాస భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రమేశ్, మల్టీజోన్– 1 ఐజీ పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, జీవన్‌రెడ్డి, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్‌రెడ్డి, మురలీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment