నేతన్నల దరి చేరిన నూలు డిపో
సిరిసిల్ల: నేతన్నల చిరకాల వాంఛ నెరవేరింది. వ స్త్రోత్పత్తికి అవసరమైన నూలును అరువు (క్రెడిట్) పై అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం రే వంత్‌రెడ్డి బుధవారం వేములవాడలో నూలు డిపో ను ప్రారంభించారు. నేషనల్ టెక్స్‌టైల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌డీసీ) ద్వారా నూలు కొనుగోలు చేసి వస్త్రోత్పత్తిదారులకు అందిస్తారు. డిపో ప్రారంభానికి ముందు టెస్కో జీఎం వి.అశోక్‌రావు, జౌళిశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్‌రావు సందర్శించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన నూలు వైరెటీలను పరిశీలించారు. వారం రోజుల్లో పూర్తి స్థాయిలో నూలు డిపో పని చేస్తుందని, ఆర్‌వీఎం వస్త్రాల తయారీకి అవసరమైన నూలు అందిస్తామని టెస్కో అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment