మా పనులు కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటోంది
● చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
సిరిసిల్ల: బీఆర్‌ఎస్ హయాంలో చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలో వేసుకుంటోందని చొ ప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. సిరిసిల్ల తెలంగాణభవన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. రాజన్న సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి అబద్దాలు మాట్లాడారన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నామస్మరణ లేకుండా రేవంత్‌రెడ్డికి పూట గడవడం లేదని ఎద్దేవా చేశారు. రైతుభరోసా ఇవ్వకుండా, రూ.2లక్షల రుణమాఫీ చేయకుండా మోసం చేశారని, ఆసరా పెన్షన్ డబుల్ చేయలేదన్నారు. వేములవాడ ఆ లయానికి 24 గుంటల భూమి ఉంటే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమీకరించిన 33 ఎకరాల్లోనే మీటింగ్‌పెట్టి కేసీఆర్ ఏం చేయలేదనడాన్ని ప్రశ్నించారు. బద్దిపోచమ్మ ఆలయానికి 39 గుంటల భూమిని రూ.19కోట్లతో సేకరించామన్నారు. మధ్యమానేరు, అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిర్మించి కేసీఆర్ కోటి ఎకరా లకు నీరిస్తే పంటలు బాగా పండాయని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 50వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్య లపై చర్చకు సిద్ధమన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, కుంబాల మల్లారెడ్డి, గుండ్లపల్లి పూర్ణచందర్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment