సిరిసిల్ల ఆర్డీవోగా సైదులు
సిరిసిల్లకల్చరల్: సిరిసిల్ల రెవెన్యూ డివిజనల్ అధికారిగా సైదులు నియమితులయ్యారు. ఇన్నాళ్లు ఇక్కడ ఆర్డీవోగా పనిచేసిన వెంకట ఉపేందర్‌రెడ్డి కీసరకు బదిలీ అయ్యారు. ఆ యన స్థానంలో కీసరలో విధులు నిర్వర్తిస్తున్న సైదులు సిరిసిల్లకు బదిలీపై రానున్నారు.
సొసైటీల సేవలు ఉపయోగించుకోవాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సేవలను ఉపయోగించుకోవాలని కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు కోరారు. ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి సొసైటీ నూతన భవనాన్ని బుధవారం ప్రారంభించి మాట్లాడారు. క్రిమిసంహారక మందులు పిచికారీ చేసేందుకు డ్రోన్స్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అనంతరం రేపాక, కందికట్కూర్ గ్రామాల్లోని గోదాములను ప్రారంభించారు. ప్యాక్స్ చైర్మన్‌లు తిరుపతిరెడ్డి, అనంతరెడ్డి, వైస్‌చైర్మన్‌లు తిరుపతి, శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లు నవీన్‌రెడ్డి, నాగలక్ష్మి, సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్‌రెడ్డి, ఇల్లంతకుంట కోఆపరేటీవ్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్, కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, మల్లేశం పాల్గొన్నారు.
లింగ నిర్ధారణ చేస్తే ఏడాది జైలు
సిరిసిల్లకల్చరల్: స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.10వేలు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని డీఎంహెచ్‌వో రజిత హెచ్చరించారు. జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను బుధవారం తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. స్కానింగ్ సెంటర్‌లు ఇచ్చే సర్టిఫికెట్లపై టెక్నీషియన్‌ల పేర్లు ఉండాలని సూచించారు.
వేతనాలు పెంచండి సారూ..
సిరిసిల్లకల్చరల్: అరకొర వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని, నెలకు రూ.15వేలు చెల్లించాలని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్లు డిమాండ్ చేశా రు. ఈమేరకు బుధవారం కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ పరిపాలనాధికారికి వినతిపత్రం అందజేశారు. సంఘం కన్వీనర్లు మీసం లక్ష్మణ్, బొడ్డు నర్సవ్వ, ప్రతినిధులు శంకరయ్య, తేజస్విని, శారద, శ్యామల, దండు లక్ష్మి, రజిత లక్ష్మి, నరసింహ, వీరభద్ర, రేణుక, వనజ, శంకర్, కొమురయ్య, మంజుల, లలిత, లావణ్య పాల్గొన్నారు.
ఇల్లంతకుంట పీహెచ్‌సీ తనిఖీ
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి రజిత బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పెద్దలింగాపూర్‌లోని పీహెచ్‌సీ ప్రారంభోత్సవానికి సంబంధించిన పనులు పరిశీలించారు. వైద్యులు శరణ్య, జీవనజ్యోతి, వైద్యాధికారి రమణ, సీహెచ్‌వో శాంత పాల్గొన్నారు.
చందుర్తి సింగిల్‌విండోలో తనిఖీలు
చందుర్తి(వేములవాడ): స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవినీతి, అక్రమాలపై విచారణ అధికారి రాములు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ లచ్చయ్య బుధవారం విచారణ చేపట్టారు. ఇప్పటికే చందుర్తి, రామన్నపేట, తిమ్మాపూర్, నర్సింగపూర్, ఆశిరెడ్డిపల్లెలకు చెందిన 142 మంది రైతుల నుంచి వివరాలు సేకరించినట్లు విచారణాధికారి రాములు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment