కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం
సిరిసిల్లకల్చరల్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఫిబ్రవరి 21 వరకు http://tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 23న ప్రవేశపరీక్ష నిర్వహించనుంది. దరఖాస్తు చేసుకునేందుకు కులం, ఆదాయం సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, జనన ధ్రువీ కరణపత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు అవసరం. అభ్యర్థులకు అనువుగా సర్టిఫికెట్లు జారీ చేసేందుకు కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కెనాల్ పరిశీలించిన ఈఈ
ముస్తాబాద్: మండలంలోని తెర్లుమద్దిలోని మానేరు కెనాల్‌ను బుధవారం ఈఈ అమరేందర్‌రెడ్డి పరిశీలించారు. కాల్వలో పిచ్చిమొక్కలు తొలగించాలని సిబ్బందికి సూచించారు. మాజీ సర్పంచ్ కిషన్‌రావు, డీఈ రవికుమార్, ఏఈ వంశీ, వర్క్ ఇన్‌స్పెక్టర్ రాజు ఉన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
వేములవాడఅర్బన్: క్రీడలతో మానసికోల్లా సం కలుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ అన్నారు. వేములవాడలో నిర్వహించిన ఎస్సారార్ ప్రీమియం లీగ్ సీజన్ విజేతలకు బుధవారం బహుమతులు అందించి మాట్లాడారు. క్రీడలతో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు. మర్రిపల్లిలో క్రీడామైదానం అందుబాటులోకి తెస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment