చైనా మాంజా విక్రయిస్తే చర్యలు
వీర్నపల్లి(సిరిసిల్ల): చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల స్ట్రైక్‌ఫోర్స్ సెక్షన్ ఆఫీసర్ భూలక్ష్మి హెచ్చరించారు. వీర్నపల్లి మండలంలోని పలు దుకాణాలను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నైలాన్, సింథటిక్ దారాలతో తయారుచేసే చైనా మాంజాలతో మనుషులతోపాటు పక్షులకు సైతం ప్రమాదకరమన్నారు. గాలిపటాలకు కాటన్ దారాలు మాత్రమే వాడాలని, చైనా మాంజా వినియోగించొద్దని కోరారు. తనిఖీల్లో గొల్లపల్లి, అల్మాస్‌పూర్ సెక్షన్ ఆఫీసర్‌లు సక్కారం, పద్మలత, బీట్ ఆఫీసర్లు సతీశ్, కిరణ్, రజిత, బేస్‌క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment