క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి
● జడ్జి జ్యోతిర్మయి
వేములవాడ: క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి పేర్కొన్నారు. అడ్వకేట్ అసో సియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడలను బుధవారం ప్రారంభించి మాట్లాడారు. రిపబ్లిక్ డే సందర్భంగా అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏటా క్రీడలు నిర్వహించుకో వడం అభినందనీయమన్నారు. ఏజీపీ బొడ్డు ప్రశాంత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి అవదూత రజనీకాంత్, క్రీడల కార్యదర్శి నాగుల సంపత్‌గౌడ్, న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల్‌గౌడ్, విద్యాసాగర్‌రావు, పురుషోత్తం, ప్రతాప సంతోష్, అన్నపూర్ణ, సుజాత, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు శిక్ష
● జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మైనర్‌లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు శిక్ష అనుభవించాల్సి వస్తోందని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ హెచ్చరించారు. మండలంలోని రాచర్లబొప్పాపూర్‌లోని జ్ఞానదీప్ స్కూల్‌లో బుధవారం నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవం, సడక్ సురక్షా అభియాన్–జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. టీఐడీఈఎస్ ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలు పాటించకుంటే శిక్షలు కఠినంగా ఉన్నాయన్నారు. 18 ఏళ్లు నిండిన తర్వాత ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకొని లైసెన్స్‌లు పొంది డ్రైవింగ్ చేయాలని సూచించారు. మోటార్ వాహన అధికారి వంశీధర్ మాట్లాడుతూ.. పాఠశాల వాహనాల డ్రైవర్లకు బస్సు నడిపే సమయంలో తప్పకుండా సహాయ వ్యక్తి ఉండాలని సూచించారు. మద్యం తాగి, ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడిపితే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. సహాయక మోటార్ వాహన అధికారి పృథ్వీరాజు, పాఠశాల ప్రిన్సిపాల్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫేక్ సర్టిఫికెట్లపై ఎస్పీ ఆరా ?
వేములవాడ: రాజన్న ఆలయంలో హరికిషన్ అనే ఉద్యోగి ఫేక్ సర్టిఫికేట్లతో ప్రమోషన్ పొందారంటూ ఆలయ ఈవో వినోద్‌రెడ్డి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. అయితే సదరు వ్యక్తి పోలీసులకు చిక్కకుండా తిరగడంతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ కేసుపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఆమేరకు రెండు రోజుల నుంచి స్పెషల్ పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం ఆలయ ఉద్యోగుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.
గంగమ్మ జాతరకు రండి
● కేటీఆర్‌కు గంగపుత్రుల ఆహ్వానం
సిరిసిల్లటౌన్: మానేరుతీరంలో ఈనెల 29న నిర్వహించే గంగమ్మ కల్యాణోత్సవానికి రావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు గంగపుత్రులు ఆహ్వానపత్రిక అందించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణభవన్‌లో కలిశారు. రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కావూరి వెంకటేశ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాష్ట్ర నాయకులు గౌటే గణేశ్, సుదర్శన్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు స్వరూప తదితరులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. సిరిసిల్ల గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ముడారి రాజు(చిన్న), సెక్రెటరీ గడప లక్ష్మణ్, గంగపుత్ర సంఘం సొసైటీ అధ్యక్షుడు వంగల రాజనర్సు, నరేశ్, గడప చింటూ, గడప భాస్కర్, కూర శ్రీధర్, గడప ప్రవీణ్‌కుమార్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment