నిలదీత.. ప్రశ్నల వర్షం
● గ్రామ, వార్డు సభల్లో గందరగోళం ● పథకాలపై అధికారుల నిలదీత ● పోలీసుల బందోబస్తు మధ్య గ్రామసభలు
సిరిసిల్ల: జిల్లావ్యాప్తంగా రెండోరోజు బుధవారం గ్రామ, వార్డుసభలు నిర్వహించారు. రేషన్‌కార్డులు ఎప్పుడు ఇస్తారని, రూ.2లక్షల రుణమాఫీ అందరికీ కాలేదని, భూములు ఉన్న వారికి ఇందిరమ్మ ఆ త్మీయ భరోసా ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. ము స్తాబాద్ మండలం ఆవునూరులో అనర్హులకు ఇంది రమ్మ ఆత్మీయ భరోసాలో స్థానం కల్పించారని విమర్శించారు. రేషన్‌కార్డుల జారీలో జాప్యంపై అడిగారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, ఎస్సై గణేశ్ ఆందోళన చేసిన వారిని పక్కకు తప్పించారు. గందరగోళం మధ్యలోనే ప్రత్యేకాధికారి లత గ్రామసభను నిర్వహించేందుకు ప్రయత్నించారు. కోనరావుపేట మండలం మల్కపేటలో మాజీ ఎంపీపీ చంద్రయ్యగౌడ్ అధికారులను రైతు రుణమాఫీపై ప్రశ్నించారు. రైతుభరోసా ఎప్పుడు వేస్తారని అడిగారు. స్థానికుల నిరసనలు, నినాదాల మధ్య గ్రామసభ సాగింది. ఇదే మండలంలోని కనగర్తి, ధర్మారంలోనూ అధికారులను స్థానికులు నిలదీశారు. బోయినపల్లి మండలం అనంతపల్లెలో భూమి ఉన్న వారినే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో ఎంపిక చేశారని స్థానికులు ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల జాబితాలో అనర్హులు ఉన్నారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ అనర్హుల పేర్లు తొలగిస్తామని స్పష్టం చేశారు. వీర్నపల్లి మండలంలో జరిగిన గ్రామసభల్లో స్థానికులు నిరసనలు వ్యక్తం చేశారు.
పట్టణాల్లోనూ..
సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో జరిగిన వార్డుసభల్లోనూ స్థానికులు వినతిపత్రాలు అందించగా.. కొందరు ఎన్నిసార్లు దరఖాస్తు చేయాలని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డుసభలు.. కొన్ని చోట్ల సవ్యంగా జరగ్గా.. కొన్ని ప్రాంతాల్లో నిరసనలు.. నిలదీతల మధ్య సాగాయి.
అర్హులందరికీ పథకాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా పథకాలు, రేషన్ కార్డులు అర్హులందరికీ అందిస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ఈనెల 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభకు హాజరై మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. అర్హులందరికీ ఆయా పథకాలు అమలు చేస్తామని, గ్రామసభలో పెట్టే ప్రాథమిక జాబితా మంజూరుపత్రం కాదు, దరఖాస్తుల స్వీకరణ జాబితా మాత్రమేనని స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారు ఉంటే అర్జీలు సమర్పించాలని సూచించారు. తహసీల్దార్ రామచంద్రం, ఎంపీవో రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment