నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తున్న నగర అభిమానులకు ఆశించిన ఆనందం మాత్రం దక్కలేదు. అప్పుడప్పుడు కొన్ని మెరుపులు తప్ప ఆటగాళ్ల నుంచి అద్భుతమైన ప్రదర్శనలేవీ రాకపోగా, హైదరాబాద్ టీమ్ కూడా పేలవ ప్రదర్శనతో నిరాశపర్చింది. సొంతగడ్డపై ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఆ జట్టుకిది ఐదో పరాజయం. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ తరహాలోనే శనివారం లక్నోతో జరిగిన పోరు కూడా ఫ్యాన్స్‌లో పెద్దగా ఆసక్తిని రేపలేదు. మైదానంలో దాదాపు 11 వేలకు పైగా సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇక చివరగా ఈ నెల 18న బెంగళూరుతో పోరు మిగిలి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment