షాబాద్: రైతులకు ఒకే విడతలో రుణమాఫీ చేయాలని తెలంగాణ ప్రజా చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు నర్సింలు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లు గడుస్తున్నా రైతులకు రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడం దారుణమన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రుణమాఫీ చేయ కుంటే రైతులు తగిన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ, శంకర్, మోయిన్ తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటి
పర్యావరణాన్ని పరిరక్షించాలి
శంకర్‌పల్లి: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీఆర్‌డీఏ పీడీ ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్వర్తి గ్రామంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్క లు నాటుకోవాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కలు గ్రామాలకు పచ్చటి తోరణాలుగా మారాయని గుర్తు చేశారు. గ్రామాల్లో ఎక్కడ ఖాళీ స్థలం ఉన్న మొక్కలు నాటాలన్నారు. నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ధర్మన్నగారి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీడీవో వెంకయ్యగౌడ్, ఏపీవో నాగభూషణ్, ఎల్వర్తి సర్పంచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ
అందరి బాధ్యత
షాద్‌నగర్: పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఏసీపీ కుశాల్కర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ సీఐ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.కార్యక్రమానికి ఏసీపీ కుశాల్కర్ హా జరై మొక్కలు నాటి నీళ్లు పోశారు.ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచే బా ధ్యతను తీసుకోవాలని అన్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను కాపాడాలని సూచించారు. మనం నాటిన మొక్క భావి తరాలకు ఫలాలను అందిస్తుందన్నారు. చెట్లు లేకపోతే వాయు కాలుష్యం ఏర్పడి వాతావరణం పూర్తిగా కలుషితమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ శ్రీశైలం, ఎస్‌ఐలు విజయ్, దేవకి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పీజీ కాలేజీల డైరెక్టర్ నియామకం
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలో అయిదు జిల్లాల కేంద్రాలలో ఓయూ అనుబంధంగా కొనసాగుతున్న పీజీ కాలేజీల డైరెక్టర్‌గా ప్రొ.రవికుమార్ నియమితులయ్యారు. ఓయూ పరిధిలోని సిద్దిపేట, వికారాబాద్, నర్సాపూర్, జోగిపేట, మిర్జాపూర్ పీజీ కాలేజీల నిర్వహణకు ప్రొ.రవికుమార్ డైరెక్టర్‌గా సోమ వా రం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment