కేశంపేట: పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం వచ్చిన బియ్యంలో పురుగులు కనిపించాయి. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు రెండు రోజుల క్రితం సన్న బియ్యం చేరాయి. వీటిలో పురుగులు అధికంగా ఉన్నట్లు నిర్వాహకులు గుర్తించారు. అధికారులు స్పందించి పాఠశాలకు పంపిణీ చేసిన బియ్యాన్ని వెనక్కి తీసుకోని స్వచ్ఛమైన బియ్యం పంపిణీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
గ్రూప్–4 అభ్యర్థులకు
ప్రత్యేక బస్సులు
షాద్‌నగర్: టీఎస్‌పీఎ స్సీ నిర్వహిస్తున్న గ్రూ ప్–4 పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు షాద్‌నగర్ డిపో మేనేజర్ ఉష తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. పరీక్ష రాసే అభ్యర్థుల కోసం శనివారం ఉదయం 5 నుంచి షాద్‌నగర్ డిపో ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అతిథి అధ్యాపకులకు
దరఖాస్తుల ఆహ్వానం
కందుకూరు: కందుకూరు, వికారాబాద్ మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా పని చేయడానికి అర్హత, ఆసక్తి ఉన్న పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిగ్రీ కళాశాలల ప్రత్యేకాధికారి డా.జంగం విరూపాక్షప్ప శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, కామర్స్, మేనేజ్‌మెంట్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జియాలజీ, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులతో పాటు హెల్త్ సూవర్‌వైజ్‌ర్/స్టాఫ్ నర్సుల నియామకాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. పీహెచ్‌డీ, ఎంఫిల్, నెట్, సెట్/స్లెట్ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఓపెన్ కేటగిరీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాల న్నారు. డిగ్రీ, పీజీ కళాశాలల్లో పని చేసిన అనుభవాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామన్నారు. దరఖాస్తుతో పాటు పీజీ సర్టిఫికెట్స్, పీహెచ్‌డీ, ఎంఫిల్, సర్వీస్ సర్టిఫికెట్లు జతచే యాలన్నారు. కళాశాల, సబ్జెక్ట్ అవసరాలను బట్టి మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూలకు పిలవడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఈనెల 6లోపు దరఖాస్తులను ఆర్‌సీఓ కార్యాలయం లేదా బీసీ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలల్లో అందించవచ్చన్నారు. ఇతవ వివరాలకు 99892 69715 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
పెద్దమ్మతల్లికి
బంగారు బోనం
బంజారాహిల్స్/ చార్మినార్: సప్తమాతృకల సప్తబంగారు బోనం పూజా కార్యక్రమాల్లో భాగంగా భాగ్యనగర శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు ఆలె భాస్కర్‌రాజ్ ఆధ్వర్యంలో మూడో బంగారు బోనాన్ని శుక్రవారం శ్రీ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లికి సమర్పించారు. జోగిని నిషా క్రాంతి బంగారు బోనంతో ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పించారు. నగరంలోని ఏడు అమ్మవారి దేవాలయాలకు ఏడు బంగారు బోనాలతో పాటు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న నిర్వాహకులు ఇప్పటికే మొదటిబోనాన్ని గోల్కొండ జగదాంబ అమ్మవారికి, రెండో బంగారు బోనాన్ని బల్కంపేట ఎల్లమ్మతల్లికి సమర్పించారు. మూడో బంగారు బోనాన్ని గౌలిపుర కోట మైసమ్మ దేవాలయం నుంచి బాజా భజంత్రీలు, పెద్ద ఎత్తున భక్తుల సమక్షంలో బయల్దేరి పెద్దమ్మతల్లికి సమర్పించిమొక్కులు చెల్లించుకున్నారు. భారీగా భక్తులు కార్యక్రమంలో పాల్గొని పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు. బంగారు బోనా న్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment