● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి
● భాగ్య నగరంపై తనదైన ముద్ర
● సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరు
సాక్షి, సిటీబ్యూరో/అంబర్‌పేట: కమలం పార్టీ రాష్ట్ర సారథిగా నగర నేతకు అధినాయకత్వం పట్టం కట్టింది. ఆయన ఈ పదవిని అధిష్టించడం మూడోసారి కావడం గమనార్హం. కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రెండుసార్లు ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన కిషన్‌రెడ్డికి మరోసారి పగ్గాలు అప్పగించడం ద్వారా నగర బీజేపీకి పార్టీ హైకమాండ్ అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో జన్మించిన కిషన్‌రెడ్డి మూడు దఫాలు ఎమ్మెల్యేగా, శాసన సభా పక్ష నేతగా వ్యవహరించారు. దీంతో ఆయనకు నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్‌తో ప్రత్యేక సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రజా సంఘాలతో సైతం కిషన్‌రెడ్డి తనదైన శైలిలో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. నగర సమస్యలపై పోరాడి వాటిని పరిష్కరించుకునే వారు. నిత్యం అంబర్‌పేట నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేసి తిరిగా శాసన సభ వ్యవహారాలు నిర్వహించేవారు.
రాష్ట్రంలో
రామరాజ్యం రావాలి
తుక్కుగూడ: రాష్ట్రంలో రాబందులు రాజ్యం పోయి రామ రాజ్యం రావాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి అన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తుక్కుగూడ మున్సిపల్ కేంద్రంలో ఇంటింటా బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అ వినీతి, కుటుంబ పాలనకు స్వస్తి చెప్పే రోజుల దగ్గరపడ్డాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నిరుపేదల సంక్షేమం, చేపడుతున్న పథకాలను పార్టీ శ్రేణులు ఇంటింటా తెలియజేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో ఆపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరందర్‌గౌడ్, మీడియా కన్వీనర్ వీ.సుధాకర్ శర్మ, మున్సిపల్ అధ్యక్షుడు లక్ష్మణ్, మున్సిపల్ చైర్మన్ కె.మధుమోహన్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం డిపోకు ఉత్తమ అవార్డు
ఇబ్రహీంపట్నం: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రా ష్ట్ర స్థాయిలో తృతీయ ఉత్తమ డిపోగా ఇబ్రహీంపట్నంను ప్రకటించి అవార్డు అందజేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో డిపో మేనేజర్ అశోక్‌రాజు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. గ్రేటర్ పరిధిలోని 25 డిపోల్లో అధిక ఆదాయం తీసుకొస్తున్నందుకుగాను ఇబ్రహీంపట్నం డిపోకు ఈ అవార్డు దక్కింది.
అక్రమ నిర్మాణాల కూల్చివేత
పహాడీషరీఫ్: జల్‌పల్లి పెద్ద చెరువు కట్ట దిగువన ప్రభుత్వ భూమిలో వెలసిన ఐదు అక్రమ నిర్మాణాలను బాలాపూర్ రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చివేశారు. 223 సర్వే నంబర్‌లో కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు నిర్మాణాలు చేపట్టారు. దీనిపై సమాచారం అందుకున్న బాలాపూర్ తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ నారాయణ మంగళవారం పోలీస్ బందోబస్తు నడుమ జేసీబీతో నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లయితే క్రిమినల్ నమోదు చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment