షాద్‌నగర్: నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం పాలమూరు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ట్రస్టు చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని ట్రస్టు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంతో మంది యువతీ యువకులు ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధి, ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారని అన్నారు. వారికి ఉపాధి కల్పించేందుకు శ్రేయాన్ కన్సల్టీ సర్వీస్ సహకారంతో పాలమూరు ట్రస్టు ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 17వ తేదీ వర పట్టణంలోని ఈడెన్ ఫంక్షన్ హాల్‌లో రెండో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐటీ, ఐటీఈఎస్, కోర్, మేనేజ్‌మెంట్, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల్లో సుమారు ఐదువేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించనున్నట్టు చెప్పారు. పది నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మా, ఎంఫార్మా, చేసిన వారు పాల్గొనవచ్చని తెలిపారు. రూ.20వేల నుంచి రూ.50వేలకు పైగా వేతనాలు పొందొచ్చన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 94909 56938, 93981 60997 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
వచ్చే ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ పాత్ర కీలకం
డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి
బడంగ్‌పేట్: యూత్ కాంగ్రెస్ సభ్యులు చురుకై నా పాత్ర పోషిస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. కార్పొరేషన్‌లో పరిధిలోని నాదర్‌గుల్‌లో ఆదివారం యూత్ కాంగ్రెస్ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని, పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. కాంగ్రెస్‌ను అఽధికారంలోకి తేవడంలో యూత్ కాంగ్రెస్ పాత్ర చాలా కీలకమని అన్నారు. కార్యక్రమంలో మేయర్ చిగురింత పారిజాత, ప్రొటోకాల్ కార్యదర్శి బంగారు బాబు, ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ మహేశ్వరం అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్‌రెడ్డి, కార్పొరేషన్ అధ్యక్షుడు సుభాన్‌యాదవ్, మహిళా అధ్యక్షురాలు అమృత, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ప్రాణాలైనా అర్పిస్తాం .. ఫార్మాసిటీ రానివ్వం
యాచారం: ఫార్మాసిటీ బాధిత గ్రామాల్లో ప్రజాయాత్రలో భాగంగా ఆదివారం నక్కర్తమేడిపల్లి–నానక్‌నగర్ గ్రామాల మధ్యన నిర్మించిన ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట స్తూపం వద్ద ప్రొఫెసర్ కోదందరాం, మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డి, పర్యావరణవేత్తలు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి శ్రేణులు ప్రతిజ్ఞ చేశారు. ఫార్మాసిటీని ఏర్పాటు కాకుండా అడ్డుకుంటాం.. ప్రాణాలైనా అర్పిస్తాం గానీ ఫార్మాసిటీని రానివ్వం అంటూ ప్రతిజ్ఞ చేశారు. 2018లో ఫార్మాసిటీపై ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించిన స్థలంలోనే స్థానిక రైతులు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట స్తూపాన్ని నిర్మించారు.
దిగొచ్చిన చికెన్
వికారాబాద్ అర్బన్: చికెన్ ధర దిగొచ్చింది. రెండు నెలల పాటు కిలోకు రూ.300 నుంచి రూ.340 వరకు పలకగా.. గడిచిన వారం రోజుల్లో ఏకంగా రూ.100 తగ్గింది. ఆదివారం మార్కెట్‌ల్లో కిలో చికెన్ రూ.250 చొప్పున విక్రయించారు. ధర తగ్గడంతో కోడికూర ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు నెలల పాటు ఇవే ధరలు కొనసాగవచ్చని వ్యాపారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment