కడ్తాల్: మహేశ్వర మహాపిరమిడ్‌లో ధ్యాన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ సంస్మరణోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. పత్రీజీ తుదిశ్వాస విడిచి ఏడాది పూర్తి కావడంతో ది పిరిమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో ధ్యానులు మహేశ్వర మహాపిరమిడ్ చేరుకుంటున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని సోమ, మంగళ వారాల్లో పిరమిడ్ ఆవరణలో ప్రత్యేక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
పచ్చదనమే గ్రీన్ ఇండియా చాలెంజ్ ధ్యేయం
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి
సంతోష్‌కుమార్ వెల్లడి
రాయదుర్గం: మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసి పచ్చదనం పెంపొందించేందుకే ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ కార్యక్రమ సృష్టి కర్త, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని శాంతిసరోవర్ ప్రాంగణంలో బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతిష్టా త్మకంగా చేపట్టిన ‘కల్పతరువు–2’ కార్యక్రమా న్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం శాంతిసరోవర్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భిన్న రంగాల్లో ఉన్నప్పటికీ అందరూ సమాజం బాగుండాలనే ఆశయంతో చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా తాము, కల్పతరువు ద్వారా బ్రహ్మకుమారీస్ సంస్థ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం భగవంతుడి సంకల్పంగా భావిస్తున్నామన్నారు. కల్పతరువు–1లో బ్రహ్మకుమారీస్ సంస్థ ద్వారా 16 లక్షల మొక్కలు నాటడం వారి సంకల్ప శక్తికి నిదర్శనమని, కల్పతరువు–2లో అంతకుమించి మొక్కలు నాటాలని ఆయన కోరారు. శాంతిసరోవర్ డైరెక్టర్ బి.కె కుల్‌దీప్ దీదీ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా మొక్కలు నాటడం, ప్లాస్టిక్ నిర్మూలనకు పాటుపడటం సమాజహిత కార్యక్రమాలన్నారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపక సభ్యులు కరుణాకర్‌రెడ్డి, రాఘవ, పలువురు బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఓయూ న్యాయశాస్త్రం కోర్సుల పరీక్షల తేదీల వెల్లడి
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానున్న వివిధ న్యాయశాస్త్రం కోర్సుల సెమిస్టర్ పరీక్షల తేదీల ను వెల్లడించారు. ఎల్‌ఎల్‌బీ, బీఏ ఎల్‌ఎల్‌బీ, బీకాం ఎల్‌ఎల్‌బీ, బీబీఏ (3, 5 సంవత్సరాలు) కోర్సుల రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పోస్టుల సెమి స్టర్ పరీక్షల వివరాలను ఉస్మానియా.ఏసీ.ఇన్ వెబ్‌సైట్లో చూడొచ్చు.
హెచ్‌ఐసీసీలో
హైలైఫ్ ఎగ్జిబిషన్ ప్రారంభం
మాదాపూర్: ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్రాభరణాలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఆదివారం హైలైఫ్ ఎగ్జిబిషన్‌ను నటి నిహారిక కొణిదెల నిర్వాహకుడు డొమినిక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలోని 350 మంది టాప్ డిజైనర్లు రూపొందించిన ఉత్పత్తులు ఉన్నాయన్నారు. స్టైల్, డెకార్, లెగ్జరీ, ఫ్యాషన్ జ్యూలరీ, యాససరీస్ తదితర ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో యాక్టివిటిస్ట్ ఎస్.సబితారెడ్డి, నటీమణులు ఐశ్వర్య వెల్లింగుల, శాన్విమెఘన పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment