మొయినాబాద్ రూరల్: ఇంటర్మీడియెట్‌లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఈ నెల 21న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ చేవెళ్ల గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. చేవెళ్ల నాన్ సీఈవో కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీలో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. చిలుకూరు బాలాజీ సమీపంలోని గురుకుల పాఠశా లలో ఇంటర్మీడియెట్ ఎంపీసీలో స్పాట్ అడ్మిష న్స్ ఉంటాయన్నారు.2022–23లో 10వ తర గ తి పూర్తి చేసిన విద్యార్థినులు 21న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు తమ సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు.
ఆయుష్మాన్ భారత్‌లో నమోదు చేసుకోండి
తుర్కయంజాల్: ఆసక్తి ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌ల నిర్వాహకులు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డా.వెంకటేశ్వర రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకం గురించి పీహెచ్‌సీల్లో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు తగిన శిక్షణ ఇచ్చామని, రిజిస్ట్రేషన్ కాపీ, ఎలక్ట్రిసిటీ బిల్, క్లినిక్ ఫొటో తదితర కాపీలతో దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రి లేదా ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో సంప్రదించి, పోర్టల్‌లో నమోదు చేసు కుని గుర్తింపు నంబర్‌ను పొందాలని సూచించారు. జిల్లాలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్,డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు తగిన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.
ఆర్టీసీకి ఉద్యోగులు
మూల స్తంభాలు
షాద్‌నగర్‌రూరల్: ఆర్టీసీ సంస్థకు ఉద్యోగులు మూలస్తంభాలని, ప్రతి ఉద్యోగి సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డిపో మేనేజర్ ఉష అన్నారు. డిపోలో జూలైలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, మెకానిక్‌లను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తే సంస్థ లాభాల బాటలోకి వెళ్తుందని అన్నారు. ప్రయాణికులకు అనుకూలంగా బస్సులు నడిపించాలని, వారు కోరిన చోట బస్సులను నిలపాలని సూచించారు. ప్రజలు ప్రైవేట్ వాహనాలవైపు వెళ్లకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ సుధాకర్, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు పాల్గొన్నారు.
26న మంచిరేవులలో హరితహారం
● పాల్గొననున్న సీఎం కేసీఆర్
● ఏర్పాట్లను పరిశీలించినసీఎస్ శాంతి కుమారి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: హరితహారంలో భాగంగాఈ నెల 26న మంచిరేవులలోని ఫారెస్ట్ ట్రేక్ పార్కులో 2 వేల మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటున్న సందర్భంగా ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం పరిశీలించారు. సీఎం మొక్కలు నాటేందుకు ఎంపిక చేసిన ప్రాంతంలో గుంతలు తవ్వాలని, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాకు 4,30,500 మొక్కలు నిర్దేశించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సీఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, కలెక్టర్ హరీశ్, సైబరాబాద్ అడిషనల్ సీపీ అవినాష్, జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్ రెడ్డి, పోలీసు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment