‘ఇంటికి వంద– బడికి చందా’ | - | Sakshi
Sakshi News home page

‘ఇంటికి వంద– బడికి చందా’

Published Thu, Sep 5 2024 2:30 PM | Last Updated on Thu, Sep 5 2024 2:30 PM

‘ఇంటి

అబ్దుల్లాపూర్‌మెట్‌: అరకొర వసతులు.. శిథిల భవనాలు.. అపరిశుభ్ర వాతావరణం.. విద్యాభ్యాసం అంతంతే.. ఇవీ ప్రభుత్వ పాఠశాలలపై సాధరణంగా అందరికీ ఉండే అభిప్రాయాలు. కానీ ఆ పాఠశాలను చూస్తే ఆ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. ‘ఇంటికి వంద– బడికి చెందా’ అనే నినాదంతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం కాస్తా గ్రామస్తులను ఏకం చేసి పాఠశాల అభివృద్ధికి నడుం బిగించేలా చేసింది. ఆదర్శంగా నిలుస్తున్న ఆ పాఠశాలే అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని మజీద్‌పూర్‌ జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఒకప్పడు రంగులు వెలసిన పాత గోడలతో దర్శనమిచ్చే పాఠశాల ప్రస్తుతం రంగులతో పాటు మహనీయుల చిత్రాలతో ఆకట్టుకుంటోంది. పాఠశాల ముఖద్వారం మొదలుకుని ఆవరణలోని స్టేజీ, ఆ పక్కనే గౌతమ బుద్ధుడు, సరస్వతి విగ్రహాలను ఏర్పాటు చేయించారు ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్‌రెడ్డి. ‘ఇంటికి వంద– బడికి చందా’ అంటూ గ్రామస్తులు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేలా చేసి విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. కంప్యూటర్లు, డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేయించారు. విద్యార్థులకు స్కూల్‌ యూనిఫారాలు, క్రీడాదుస్తులు అందించారు. ప్రభుత్వ పాఠశాలంటే ఇలా ఉండాలని అనే రీతిలో తీర్చిదిద్దారు.

అందరి తోడ్పాటుతోనే..

గ్రామస్తులందరి తోడ్పాటుతోనే పాఠశాల అభివృద్ధి సాధ్యమైంది. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, విద్యాకమిటీ సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి తమవంతు కృషి చేశారు. వారందరి ప్రోద్బలంతోనే పాఠశాలను అనుకున్న స్థాయిలో ఆదర్శంగా ఉండేలా మార్చ గలిగాం. పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

– విజయభాస్కర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, మజీద్‌పూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
‘ఇంటికి వంద– బడికి చందా’ 1
1/1

‘ఇంటికి వంద– బడికి చందా’

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement