No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Thu, Sep 5 2024 2:30 PM | Last Updated on Thu, Sep 5 2024 2:30 PM

No He

కడ్తాల్‌: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న జంగయ్య పాఠశాలలో సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారు. 2022 జనవరిలో బదిలీపై వచ్చారు. నాటి నుంచి పాఠశాల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. రెండేళ్లుగా పలువురు దాతలను కలుస్తూ పాఠశాల అభివృద్ధికి చేయూతనందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

● ఇమిరిస్‌ సిరామిక్స్‌ కంపెనీ సహకారంతో పాఠశాల బ్లాక్‌ బి భవనానికి గ్రిల్స్‌ ఏర్పాటు చేయించారు.

● పాఠశాల రక్షణకోసం సొంతడబ్బులతో పాటు కొంత మొత్తం దాతలు సహకారంతో రూ.45 వేలు పోగు చేశారు. పాఠశాలలో నిరంతర నిఘా కోసం 8 సీసీ కెమెరాలను మానిటరింగ్‌ కోసం టీవీ ఏర్పాటు చేయించారు.

● పాఠశాలకు చెందిన 2021–22 బ్యాచ్‌ పదోతరగతి విద్యార్థి మారుతి ఐఐటీ వారణాసిలో సీటు సాధించగా ఉన్నత చదువుల కోసం సహచర ఉపాధ్యాయులతో పాటు, పలువురు దాతల సహకారంతో ఆర్థిక అందించేలా చేశారు.

● ఆటా ప్రతినిధుల సహకారంతో పాఠశాలకు విలువైన బ్యాండ్‌, మైక్‌ సెట్‌ ఇప్పించారు.

● ఎగుడు దిగుడుగా, గుంతలమయంగా ఉన్న పాఠశాల మైదానాన్ని గ్రామ పంచాయతీ, దాతల సహకారంతో రూ.1.20 లక్షల వెచ్చించి చదును చేయించారు. ఎస్‌జీఎఫ్‌ క్రీడలతో పాటు, అనేక క్రీడా పోటీలు నిర్వహించేందుకు అనువుగా తీర్చిదిద్దారు.

● విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఓ దాతను కలిసి సమస్యను వివరించారు. ఆయన సాయంతో విద్యార్థులకు శుద్ధమైన తాగునీటి వసతి కల్పించారు.

● పాఠశాలలో అధిక శాతం నిరుపేద విద్యార్థులే కావడంతో వారి స మస్యలతో పాటు, విద్యాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

● పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రగతికి బాటలు వేస్తున్నారు.

● గతంలో ఉమ్మడి జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా జిల్లా స్థాయి అవార్డు అందుకున్నారు. జంగయ్య సార్‌.. సేవలు మరువలేనివని గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.

బాధ్యతగా భావిస్తా ..

నిరుపేద కుటుంబంలో పుట్టిన నాకు ఆ కష్టాలు ఏమిటో తెలుసు. అందుకే పేదరికంలో ఉన్న విద్యార్థికి సాయం చేయడం, వసతులు కల్పించడం బాధ్యతగా భావిస్తాను. పేద విద్యార్థుల సమగ్ర వికాసం, వసతులు, సౌకర్యాల కల్పనతోపాటు పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.

– జంగయ్య, హెచ్‌ఎం, బాలుర ఉన్నత పాఠశాల, కడ్తాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
No Headline1
1/1

No Headline

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement