యువత క్రీడలపై దృష్టి సారించాలి
మొయినాబాద్: గ్రామీణ ప్రాంత యువత క్రీడలపై సైతం దృష్టి సారించాలని రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ విజయ్‌కుమార్ అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలోని కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం మొయినాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ పోలీస్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. మండల పరిధి నుంచి 14 జట్లు తలపడగా అజీజ్‌నగర్, రెడ్డిపల్లి జట్లు ఫైనల్‌కు చేరాయి. అజీజ్‌నగర్ జట్టు ప్రథమ స్థానంలో నిలవడంతో రూ.15వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన రెడ్డిపల్లి జట్టుకు రూ.పదివేలు, తృతీయ స్థానంలో నిలిచిన చందానగర్ జట్టుకు రూ.5వేలు, కనకమామిడి జట్టుకు ప్రోత్సాహక బహుమతిగా రూ.2,500 నగదు బహుమతితో పాలుగా షీల్డులు అందజేశారు. బహుమతులు అందజేసిన అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ.. యువత సన్మార్గంలో నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ ముజాఫర్ అలీ, కేజీరెడ్డి కళాశాల ఏఓ రవికిరణ్‌రెడ్డి, కానిస్టేబుల్స్ నర్సింహ, మహేశ్వర్‌రెడ్డి, బద్రి, ఈర్షత్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ విజయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment