సీపీఐ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకోవాలి
చేవెళ్ల: సీపీఐ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారు. చేవెళ్లలో బుధవారం డివిజన్‌లోని మండలాల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకై క పార్టీ సీపీఐ అన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. దేశంలో సీపీఐ ఏర్పడినప్పుడు రాచరిక వ్యవస్థలు, బ్రిటిష్‌పాలకుల అకృత్యాలు కొనసాగుతుండేవన్నారు. అప్పుడు పార్టీ ప్రజల పక్షాన నిలబడి వాటికి వ్యతిరేకంగా పోరాడిందని గుర్తు చేశారు. ఇప్పటి పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసి పాలిస్తున్నాయని మండిపడ్డారు. సీపీఐ వందేళ్ల వేడుకల సందర్భంగా అన్ని మండలకేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొనాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు కె.రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.ప్రభులింగం, మండల కార్యదర్శులు సత్తిరెడ్డి, సుధీర్, శ్రీనివాస్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో
పెట్టుబడులు పెట్టండి
టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి
ఆమనగల్లు: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను వివిధ కంపెనీలు పరిశీలించాలని టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి కోరారు. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో తెలంగాణ ప్రతినిధులుగా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి హాజరయ్యారు. సమ్మిట్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులను వారు కలిశారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో తెలంగాణ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధన, స్మార్ట్ గవర్నెన్స్ కోసం తెలంగాణ రూపొందించిన ప్రణాళికల అమలు, ఏఐ ఇన్నోవేషన్ కేంద్రంగా ఫ్యూచర్ సిటీని మార్చాలన్న ప్రభుత్వాశయం, పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ సిస్టం, డిజిటల్ గవర్నెన్స్ మెరుగుదల, ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, స్కిల్ డెవలెప్‌మెంట్ యూనివర్సిటీ లక్ష్యాలను వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
చేవెళ్ల ఎంపీ కనిపించడం లేదని ఫిర్యాదు
చేవెళ్ల: ఎంపీగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎక్కడా కనిపించడం లేదని.. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని బీఆర్‌ఎస్ మండల నాయకులు ఆరోపించారు. ఈమేరకు ఎంపీ కనిపించడం లేదు.. వెతికిపెట్టండి అంటూ బుధవారం చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో సీఐ భూపాల్ శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు. అంతుకు ముందు ప్రజలపై అదనపు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఈఆర్సీ ఆమోదించకుండా బీఆర్‌ఎస్ పార్టీ కృషి చేసిందని సంబరాలు నిర్వహించారు. ప్రజలపై రూ.18,500కోట్ల విద్యుత్ చార్జీల భారం పడకుండా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కృషి ఫలించిందన్నారు. ఇది బీఆర్‌ఎస్ విజయంగా పేర్కొంటూ టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేవెళ్ల ప్రజల సమస్యలను తీరుస్తానని చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలుపొందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తరువాత ప్రజా సమస్యలు పట్టించుకోవటం లేదని విమర్శించారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు వెంటనే చేయిస్తానని చెప్పారని.. ఈరోడ్డుపై ఎంతో మంది ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. నిత్యం ఈరోడ్డుపై తిరిగే ప్రజలు నరకయాతన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపొందిన తరువాత ఒక్కసారి కూడా ఈరోడ్డు గురించి కానీ, ఈప్రాంత ప్రజల సమస్యల గరించి కానీ ఎంపీ పట్టించుకోలేదని విమర్శించారు. ఫిర్యాదు చేసినవారిలో బీఆర్‌ఎస్ నాయకులు ఎల్లయ్య, గని నర్సింలు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment