‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

Published Thu, Oct 31 2024 8:12 AM | Last Updated on Thu, Oct 31 2024 8:12 AM

‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

షాబాద్‌: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని రేగడిదోస్వాడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌లు పీసరి మధుసూదన్‌రెడ్డి, ఆకుల రమేష్‌తో పాటు 40 మంది వివిధ పార్టీల నాయకులు బుధవారం ఎంపీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీల్లో వైఫల్యంపై ప్రజలకు వివరించాలన్నారు. కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి సభ్యత్వ నమోదును జయపద్రం చేయాలన్నారు. పార్టీని గ్రామ స్థాయిలోనూ మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యక్త కృషి చేయాలని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువకులు, మహిళలు పెద్ద ఎత్తున సభ్యత్వం పొందుతున్నారన్నారు. అనంతరం పశువుల ఆస్పత్రిని సందర్శించారు. నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఎంపీకి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఆయన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు మాణెయ్య, బీజేవైఎం స్వచ్ఛభారత్‌ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ రాము, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి కూతురు మహేందర్‌, బీజేవైఎం మండల అధ్యక్షుడు దాదె మహేశ్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement