ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్
ఆమనగల్లు: ప్రభుత్వం గత ఏడాది జూలై నుంచి రావాల్సిన పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా న్యాయం చేయాలని కోరారు. పట్టణంలోని ఎస్టీయూ భవన్‌లో శుక్రవారం మండల మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సదానందంగౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పీఆర్‌సీ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తంచే శారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎస్టీయూ పోరాడుతోందని తెలిపారు. తమ పోరాటాల ఫలితంగానే ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని గుర్తుచేశారు. ఉపాధ్యాయులకు రావాల్సిన నాలుగు పెండింగ్ డీఏలను వెంటనే మంజూరు చేయాలని, హెల్త్‌కార్డులు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసే విధంగా చూడాలని, 317 జీఓ బాధిత ఉపాధ్యాయులకు స్థానికత ఆధారంగా వారి సొంత జిల్లాలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ అందిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. సమస్యల పరిష్కారానికి చేసే పోరాటానికి ఉపాధ్యాయులు మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సదయ్య, రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, పోల్‌రెడ్డి, రవి, రామసుబ్బారావ్, భూపాల్, కసిరెడ్డి పురుషోత్తంరెడ్డి, పరమేశ్వర్, జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి పాండురంగారెడ్డి, మండల అధ్యక్షుడు కసిరెడ్డి అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment