ఆన్‌లైన్ వేదికగా గంజాయి దందా
● విదేశీ గంజాయి సైతం దిగుమతి
● ముగ్గురు నిందితుల అరెస్ట్
పహాడీషరీఫ్: ఆన్‌లైన్ వేదికగా గంజాయి సరఫరా చేస్తున్న ఫెడ్లర్లను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేశ్వరం డీసీపీ డి.సునితా రెడ్డి, ఏసీపీ లక్ష్మీకాంత రెడ్డి, బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇద్రీస్ కలీం అలియాస్ ఫర్హాన్, మహ్మద్ అబ్బాస్ కొన్నాళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఇందుకోసం స్థానికంగా రాజేంద్రనగర్‌కు చెందిన బండారి సునీల్ అలియాస్ సులేమాన్ (30), దారుస్సలాంకు చెందిన మహ్మద్ అస్లాం(32), మెహిదీపట్నంకు చెందిన మహ్మద్ అక్రం(30)ను ఫెడ్లర్లుగా నియమించుకున్నారు. విదేశాల నుంచి ఓజీ (ఓసియన్ గాంజ.. నీళ్లలో ప్రత్యేకంగా పండించే గాంజ)ని డార్క్ వెబ్ నెట్‌తో కొరియర్‌లో దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. ఇలా దిగుమతి అయిన ఓజీని మూడు, ఐదు గ్రామల ప్యాకెట్లలో ప్యాక్ చేసి రూ.12వేలు, రూ.18 వేలుగా ధర నిర్ణయించారు. దీంతో పాటు స్థానిక డ్రై గంజాయిని సైతం ఫెడ్లర్ల ద్వారా బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, మియాపూర్, ఉప్పల్, బాలాపూర్, శంషాబాద్ ప్రాంతాల్లో వినియోగదారులకు సోషల్ మీడియా యాప్‌ల ద్వారా బుక్ చేసుకున్న విధంగా విక్రయిస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా ఎప్పటికప్పడు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న డేటాను డిలీట్ చేస్తుంటారు. తాజాగా ఆదివారం రాత్రి ఆర్‌సీఐ రోడ్డులో గంజాయిని విక్రయించేందుకు ముగ్గురు ఫెడ్లర్లు సిద్ధంగా ఉండగా, విశ్వసనీయ సమాచారం అందుకున్న బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ నేతృత్వంలో దాడులు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.72.81 లక్షల విలువైన 34 ప్యాకెట్లలో ఉన్న 170 గ్రాముల ఓజీ, తొమ్మిది కిలోల ఎండు గాంజ, రూ.2.04 లక్షల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక తూకపు మిషన్ స్వాధీనం చేసుకన్నారు. ముగ్గురు ఫెడ్లర్లను అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల అదుపులో నిందితులు
Comments
Please login to add a commentAdd a comment