నేటి నుంచి కేపీఎల్‌ క్రికెట్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కేపీఎల్‌ క్రికెట్‌ టోర్నీ

Published Thu, Jan 2 2025 6:50 AM | Last Updated on Thu, Jan 2 2025 6:50 AM

నేటి నుంచి  కేపీఎల్‌ క్రికెట్‌ టోర్నీ

నేటి నుంచి కేపీఎల్‌ క్రికెట్‌ టోర్నీ

కడ్తాల్‌: కడ్తాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ (కేపీఎల్‌) క్రికెట్‌ టోర్నీ గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్గనైజర్‌ అనిల్‌గౌడ్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గూడూరు నారాయణరెడ్డి జ్ఞాపకార్థం ఎంపీటీసీ సభ్యుల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్‌ రెడ్డి సహకారంతో ఈ టోర్నీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బటర్‌ఫ్లై సిటీ క్రికెట్‌ మైదానంలో నిర్వహించే టోర్నీ ప్రారంభోత్సవానికి సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యుడు డాక్టర్‌ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు.

ఫాంహౌస్‌లపై

పోలీసుల దాడి

ఏడుగురు అరెస్ట్టు

చేవెళ్ల: నూతన సంవత్సర వేడుకల్లో అనుమతి లేకుండా హుక్కా, మద్యం సేవిస్తున్న రెండు ఫాంహౌస్‌లపై పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలోని ముడిమ్యాల సమీపంలోని జెడ్‌ఎన్‌, మ్యాంగో రిట్రీట్‌ ఫాంహౌస్‌లలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. జెడ్‌ఎన్‌, మ్యాంగో రిట్రీట్‌ ఫాంహౌస్‌లలో అనుమతి లేకుండా మద్యం, హుక్కా సేవిస్తూ పెద్ద ఎత్తున సౌండ్‌ సిస్టంలు ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహిస్త్నుట్లు సమాచారం అందింది. వెంటనే వాటిపై దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనుమతి లేకుండా ఫాంహౌస్‌ అద్దెకు ఇచ్చిన యజామానితో పాటుగా తీసుకున్న వారిపై కేసు నమోదు చేశామని వివరించారు.

చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు యువకులకు రిమాండ్‌

పహాడీషరీఫ్‌: మహిళ మెడలో బంగారు గొలుసును తస్కరించిన ఇద్దరు యువకులను పహాడీషరీఫ్‌ పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. డిసెంబర్‌ 30న రాత్రి 9.30 గంటలకు సరస్వతి(56) అనే మహిళ తుక్కుగూడలోని తన కిరాణా దుకాణాన్ని మూసేసి, నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. వెనక నుంచి స్కూటీపై వచ్చిన యువకులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును తెంచుకొని ఉడాయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. హన్మకొండకు చెందిన గజ్జెల్లి వషిష్ట, సిద్దిపేటకు చెందిన బొగ్గుల అభిలాష్‌ బతుకుదెరువు నిమిత్తం తుక్కుగూడకు వచ్చి ఫ్యాబ్‌సిటీలోని రీనోసిస్‌ కంపెనీలో పని చేస్తున్నారు. చెడు అలవాట్లకు బానిసైన వీరు, వేత నం సరిపోక దొంగతనాలు చేయాలని నిర్ణ యించుకున్నారు. ఇందులో భాగంగానే సరస్వ తి మెడలోని గొలుసును తెంపుకొని పారిపోయారు. వీరినుంచి గొలుసు, యాక్టివా వాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

అనంతగిరి: తమ సమస్యలను పరిష్కరించే దాకా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గాంగ్యనాయక్‌ అన్నారు. వికారాబాద్‌లోని ఆర్‌డీఓ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మె బుధవారం నాటికి 27వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమను వెంటనే రెగ్యూలర్‌ చేయాలన్నారు. ఎస్‌ఎస్‌ఏను విద్యాశాఖలో విలీనం చేయాలన్నారు. తక్షణమే పే స్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రవికుమార్‌, శ్రీశైలం, రఘుసింగ్‌ ఠాకూర్‌, బ్రహ్మయ్య చారి, లక్ష్మయ్య, ప్రమోద్‌, శేఖర్‌, వసంత, శ్రీనివాస్‌, రవి, మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement