తెలంగాణలో చోరీ.. ఆంధ్రాకు పరారీ
● కారుతో ఉడాయించిన నిందితుడికి రిమాండ్ ● ఐదుతులాల బంగారం స్వాధీనం ● కేసు వివరాలు వెల్లడించిన షాద్‌నగర్ టౌన్ సీఐ విజయ్‌కుమార్
షాద్‌నగర్‌రూరల్: తెలంగాణలో చోరీలు చేస్తూ.. దొంగిలించిన సొత్తుతో ఆంధ్రప్రదేశ్‌కు పరారవుతున్నాడు. ఇదే క్రమంలో డిసెంబర్ 23న తాళం వేసిన ఓ రియల్‌ఎస్టేట్ ఆఫీస్ తాళం పగులగొట్టి దొంగతనానికి యత్నించగా ఏమీ దొరకలేదు. దీంతో కార్యాలయం ఎదుట పార్క్ చేసిన కారుతో ఉడాయించాడు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు డిసెంబర్ 31న కారును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలు బుధవారం షాద్‌నగర్ టౌన్ సీఐ విజయ్‌కుమార్ వెల్లడించారు.
తాళం వేసిన ఇళ్లు, కార్యాలయాలే టార్గెట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ప్రొద్దుటూరులోని శాకాపురానికి చెందిన పిల్లిబద్రి అలియాస్ మహేశ్ కొన్ని రోజులుగా పట్టణంలోని తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్నాడు. అనంతరం ఇక్కడ నుంచి స్వస్థలానికి పరారవుతున్నాడు. ఇదే క్రమంలో పట్టణంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన భిక్షపతిగౌడ్ రియల్‌ఎస్టేట్ వ్యాపారి. ఆయన ఈ నెల 23న కేశంపేట చౌరస్తాలోని తన కార్యాలయం వద్ద కియా సెల్టోస్ కారును పార్కు చేసి తాళాలు ఆఫీస్‌లో పెట్టి వెళ్లిపోయాడు. ఈ కార్యాలయంలో చోరీకి యత్నించిన మహే శ్‌కు ఏమీ దొరక్కపోవడంతో తాళాలు తీసుకుని కారుతో పరారయ్యాడు. డిసెంబర్ 24న కార్యాలయానికి వచ్చిన భిక్షపతిగౌడ్‌కు కారు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
టోల్‌చార్జీ కట్ అవ్వడంతో..
కారు యజమానికి టోల్‌గేట్ వద్ద డబ్బులు కట్ అవ్వడంతో మెసేజ్ రాగానే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దొంగ అక్కడ నుంచి రూట్ మార్చడంతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో పట్టణంలోని కీర్తి వెంచర్, గీత రెస్టారెంట్, చటాన్‌పల్లి ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. మంగళవారం నిందితుడి వద్ద నుంచి కారుతో పాటుగా ఐదు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ డీసీపీ రాజేశ్, అడిషనల్ డీసీపీ రామ్‌కుమార్, క్రైం డీసీపీ నర్సింహాగౌడ్, సీసీఎస్ ఏసీపీ శశాంక్‌రెడ్డి, సీఐ పవన్‌కుమార్, షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి పర్యవేక్షణలో పట్టణ సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ వెంకట్వేర్లు, డీఎస్‌ఐ శరత్‌కుమార్, సిబ్బంది మోహన్, కరుణాకర్, జాకీర్, రాజు, రఫీ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించారని.. వారికి పోలీసు ఉన్నతాధికారులతో రివార్డులు ఇప్పిస్తామని సీఐ విజయ్‌కుమార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment