మానవత్వం చాటిన కానిస్టేబుల్ కుటుంబం
కందుకూరు: రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి చెందగా వారి కుటుంబీకులు అవయవ దానం చేసి పలువురి ప్రాణాలను కాపాడి మానవత్వాన్ని చాటుకు న్నారు. ఉప్పల్‌కు చెందిన పెద్దోళ్ల ప్రశాంత్‌రెడ్డి నాలుగేళ్లుగా కందుకూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తు న్నాడు. గతనెల 28న విధులు ముగించుకుని బైక్‌పై తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో పహడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. దీంతో ప్రశాంత్‌రెడ్డి తండ్రి రిటైర్డ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ నాగిరెడ్డి, తల్లి సౌమ్య జీవన్‌దాన్‌కు కిడ్నీలు, కాలేయం ఇచ్చారు. తమ బిడ్డ ప్రాణం పోయిన బాధలోనూ అవయవదానానికి ముందుకు రావడంపై రాచకొండ పోలీస్ కమి షనర్ జి.సుధీర్‌బాబు వారిని అభినందించారు. శాఖాపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. అవయవదానం చేసిన వారు భౌతికంగా మరణించినప్పటికీ జీవించి ఉన్నట్లేనని, అవయవదానంతో మరొక మనిషికి ప్రాణం పోయడం గొప్ప విషయమన్నారు. ఉప్పల్‌లో ఆదివారం జరిగిన ప్రశాంత్‌రెడ్డి అంత్యక్రియల ఖర్చులకు రూ.90 వేలు మంజూరు చేశారు. సీపీ తరఫున మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి, సీఐ సీతారాం, రాచకొండ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ భద్రారెడ్డి, కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ సువర్ణ, సహచరులు అంత్యక్రియలకు హాజరయ్యారు.
రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి
అవయవాలను దానం చేసిన కుటుంబం
Comments
Please login to add a commentAdd a comment