ప్రభుత్వ ఆస్పత్రులకు నిధులివ్వండి
షాద్‌నగర్: పట్టణ సమీపంలో నూతనంగా నిర్మి స్తున్న వంద పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు అదనపు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. షాద్‌నగర్ పట్టణ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రిలో మార్చురీ, మోడ్రన్ కిచెన్, మెకానికల్ లాండ్రీ, కాంపౌండ్ వాల్, సీసీ రోడ్డు, పార్కింగ్ షెడ్, బయోమెడికల్ వేస్టేజీ భవన నిర్మాణానికి అదనంగా రూ.5.31 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కేశంపేటలో నిర్మాణంలో ఉన్న 30 పడకల ఆస్పత్రులకు రూ.22.80 లక్షలు మంజూరు చేయాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment