పల్లె పోరుకు రెడీ
ఎక్సలెన్స్ అవార్డు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించినందుకు ఉత్తమ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు వరించింది.
ఏర్పాట్లు పూర్తి చేస్తున్న యంత్రాంగం ● బ్యాలెట్ పేపర్ల ముద్రణకు టెండర్లు పూర్తి ● సర్పంచ్ ఓటుకు గులాబీ, వార్డు మెంబర్‌కు తెలుపు రంగు పత్రాలు ● ఓటరు జాబితా, గుర్తుల ఖరారు ● బీసీ రిజర్వేషన్ల ప్రకటనే తరువాయి ● ఆ వెంటనే ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం
8లోu
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పల్లె పోరుకు సర్వం సన్న ద్ధమైంది.ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను ప్రకటించడమే ఆలస్యం.. ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఓటర్ల జాబితా సవ రణ, పోలింగ్ కేంద్రాల ఎంపిక, తుది ఓటర్ల జాబి తా ప్రకటన వంటి పనులు పూర్తయ్యాయి. బ్యాలెట్ బాక్సులను సైతం రెడీ చేశారు. సర్పంచ్ స్థానాలకు పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా 30 గుర్తులు, వార్డు సభ్యుల కోసం 20 గుర్తులను ఈసీ ఖరారు చేసింది. సర్పంచ్ పోలింగ్‌కు పింక్ (గులాబీ) కలర్ బ్యాలెట్ పత్రం, వార్డు సభ్యుల ఎన్నికకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రాన్ని సిద్ధం చేశారు. వీటి ముద్రణకు టెండర్లు కూడా ఖరారయ్యాయి.
ప్రకటన రావడమే ఆలస్యం
జనాభా ప్రతిపాదికన స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన ఇంటింటి సమగ్ర సర్వేలో వచ్చిన వివరాల ఆధారంగా రిజర్వేషన్లు చేయాలని భావిస్తోంది. ఇంటింటి సర్వేలో భాగంగా కులాల వివరాలను కూడా సేకరించింది. ఈ డేటా కంప్యూటరీకరణ ప్రక్రియ దాదాపు పూర్తయింది. బీసీ కమిషన్ ద్వారా ఈ నివేదిక ప్రభుత్వానికి త్వరలోనే అందనుంది. ఈ రిజర్వేషన్ల ప్రకటన రావడమే ఆలస్యం.. జిల్లాలోని 549 గ్రామ పంచాయతీలు, 4,896 వార్డులకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. వీటి పరిధిలో మొత్తం 7,94,653 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,99,404 మంది పురుషులు, 3,95,216 మంది మహిళలు, 33 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. నిజానికి గతేడాది జనవరి చివరి నాటికే కొత్త పాలక వర్గాలు కొలువుదీరాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసి, ప్రత్యేక అధికారుల పాలన తీసుకొచ్చారు. పంచాయతీ ఎన్నికలు ముగి సిన తర్వాత జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్ని కలు నిర్విహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
తగ్గనున్న జీపీలు
పంచాయతీ ఎన్నికల్లో 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. 200 మంది ఓటర్లు ఉన్న చోట ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులను నియమించనున్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లాలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో పంచాయతీల సంఖ్య 558 నుంచి 549కి తగ్గింది. ఇదే సమయంలో మెయినాబాద్, చేవెళ్ల కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. మరో వైపు మహేశ్వరం, కందుకూరు కేంద్రంగా రెండు మున్సిపాలిటీలు ఏర్పాటవుతాయనే ప్రచారం కూడా లేకపోలేదు. ఇదే జరిగితే.. జిల్లాలో పంచాయతీల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది.
గుర్తులు ఖరారు
సర్పంచ్‌లను ఎన్నుకునేందుకు బ్యాలెట్ పత్రంలో చేతికర్ర, మంచం, డోర్ హ్యాండిల్, బిస్కెట్, వేణువు, జల్లెడ, పలక, టేబుల్ బ్యాటరీ, లైట్, బ్రష్, పడవ, చైను, చెప్పులు, గాలిబుడగ, కత్తెర, స్టంట్స్, టూత్‌పేస్ట్, రిమోట్, బ్యాట్, ఉంగరం, ఫుట్‌బాల్, లేడీస్ పర్సు, పాన్, చెత్తడబ్బా, వజ్రం, కొబ్బరి చెట్టు, బెండకాయ, నల్లబోర్డు, బకెట్ తదితర గుర్తులను కేటాయించారు. అదే విధంగా వార్డు సభ్యుల గుర్తులను కూడా ఖరారు చేసింది. పొయ్యి, స్టూల్, బీరువా, గ్యాస్ సిలిండర్, గౌను, విజిల్, కుండ, గరాటా, కూకుడు, డిష్, యాంటీనా, ఐస్‌క్రీం, గాసుగ్లాసు, పోస్టు డబ్బా, కవర్, కటింగ్ ప్లేయర్, హాకీ, కర్రబంతి, నెక్‌టై, విద్యుత్ స్తంభం, కేటీల్ తదితర గుర్తులను ఖరారు చేసింది. వీటితో పాటు నోటా గుర్తు కూడా ఉంటుంది.
మండలాలు 21
గ్రామ పంచాయతీలు 549
వార్డులు 4,896
పురుషులు 3,99,404
మహిళలు 3,95,216
ఇతరులు 33
మొత్తం ఓటర్లు 7,94,653
Comments
Please login to add a commentAdd a comment