జల ఘంటికలు!
గురువారం శ్రీ 9 శ్రీ జనవరి శ్రీ 2025
ఒత్తిడిని జయించండి..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి పొంచి ఉందా? అనే ప్రశ్నకు ఔననే సమాధానం వస్తోంది. పలు ప్రాంతాల్లో భూగర్భ జలా లు క్రమంగా పడిపోతున్నాయి. పక్షం రోజుల పరిధిలో అర మీటరు నుంచి మీటరుకు పైగా నీటి మ ట్టాలు అడుగంటడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వాస్తవంగా గతేడాది కంటే పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉన్న నగరంలోని కోర్‌సిటీతో పాటు శివారు, ఓఆర్‌ఆర్ లోపల మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని అర్బన్ పరిధి లో మాత్రం భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టా యి. వేసవి నాటికి నీటి సమస్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
ఇంకినవి ఇంకినట్టే తోడేస్తున్నారు..
గ్రేటర్ పరిధిలో గోదావరి, కృష్ణా, మంజీరా నదుల నుంచి ఉపరితల జలాలు సరఫరా అవుతున్నప్పటికీ.. ఇంటి అవసరాల కోసం భూగర్భ జలాలను విపరీతంగా ఉపయోగించుకున్నారు. భూమిలోకి ఇంకిన నీరు ఇంకినట్లే తోడేస్తుండటంతో భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోతున్నాయి. రెండేళ్ల క్రితం నేలలోకి ఇంకిన నీటి పరిమాణం, తోడివేతపై అధికారిక నివేదిక పరిశీలిస్తే.. తక్కువ నీరు ఇంకి, ఎక్కువ నీరు తోడిన ప్రాంతాల్లో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు మొదటి స్థానాల్లో నిలిచాయి. గతేడాది అతి తక్కువ నీరు ఇంకి, ఎక్కువ వినియోగించడంతో వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి తప్పలేదు. హైదరాబాద్ జిల్లాలో 5,808 కోట్ల లీటర్ల నీరు ఇంకగా 5,438 కోట్ల లీటర్లను ఉపయోగించుకున్నారు. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో 8,879 కోట్ల లీటర్ల నీరు ఇంకగా, 5,296 కోట్ల లీటర్లు తోడేశారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
లోలోతుల్లోకి..
మహా నగర పరిధిలో భూగర్భ జల మట్టాలు గతేడాది కంటే పడిపోయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నగరంతో పాటు శివారులోని రంగారెడ్డి జిల్లా అర్బన్ పరిధిలో మాత్రం 0.4 మీటర్లు భూగర్భజలాలు పడిపోయాయి. కేవలం నవంబర్ నుంచి పోలిస్తే డిసెంబర్ చివరి నాటికి హైదరాబాద్‌లో 0.47 మీటర్ల భూగర్భ జలమట్టాలు తగ్గగా, మేడ్చల్–మల్కాజిగిరి పరిధిలో 1.08 మీటర్లు అడుగంటాయి. హైదరాబాద్‌లో సాధారణం కంటే డిసెంబర్‌లో 18 శాతం అధిక వర్షపాతం నమోదైనా, ఆ మేరకు భూగర్భ జలాలు పెరగడం లేదు. శివారు పరిధిలోని శేరిలింగంపల్లి, మణికొండ, హయత్‌నగర్, సరూర్‌నగర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో బోర్డు నుంచి నీరు తగ్గుముఖం పట్టాయి.
న్యూస్‌రీల్
ట్యాంకర్లకు పెరిగిన తాకిడి
వేసవికి ముందే ట్యాంకర్ల డిమాండ్ తారస్థాయికి చేరుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తక్కువ లోతులో ఉన్న బోర్లలో నీరు రావడం లేదు. ఫలితంగా నీటి ట్యాంకులకు డిమాండ్ పెరిగిపోతోంది. జలమండలి పైపులైన్ నెట్‌వర్క్ ద్వారా సరఫరా చేసే నీటి పరిమాణంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేది తక్కువే అయినా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తాగునీటికి పూర్తిగా జలమండలిపైనే ఆధారపడిన ప్రాంతాల్లో ట్యాంకర్లు వెళ్లకపోయినా, జాప్యం జరిగినా తీవ్ర ప్రభావం చూపుతోంది.
ప్రస్తుతం భూగర్భ జల మట్టాలు ఇలా (మీటర్లలో)..
జిల్లా భూగర్భజల మట్టం– 2024 భూగర్భజల మట్టం–2023
హైదరాబాద్ 7.32 7.57
రంగారెడ్డి జిల్లా 9.08 8.68
మేడ్చల్–మల్కాజిగిరి 10.35 9.24
మారేడుపల్లి 12.95 10.16
సైదాబాద్ 9.90 5.23
ఖైరతాబాద్ 7.86 6.06
హస్మత్‌పేట 10.3 8.52
ఇబ్రహీంపట్నం 14.11 12.37
Comments
Please login to add a commentAdd a comment