గ్రీన్‌ఫీల్డ్ సర్వేపై ఆందోళన
ఆమనగల్లు: ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి ఫోర్త్‌సిటీ మీదుగా ప్రతిపాదిత రీజినల్ రింగ్‌రోడ్డు వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వేపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి వద్ద మంగళవారం సర్వేను రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వే కోసం ఆర్‌వీ కన్సల్టెన్సీ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు బుధవారం మున్సిపల్ పరిధిలోని సాకిబండతండాకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక గిరిజన రైతులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ భూముల్లో సర్వే చేసే అధికారం ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంతో ఉన్నకొద్దిపాటి భూమి పోతే ఎలా బతుకుతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తిరిగి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. గిరిజనులకు ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ రాంపాల్‌నాయక్, బీఆర్‌ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్ మద్దతు పలికారు. ఆందోళన చేస్తున్నవారికి సీఐ ప్రమోద్‌కుమార్ నచ్చజెప్పినప్పటికీ వినిపించుకోలేదు. చివరికి సర్వే చేయకుండానే సిబ్బంది, అధికారులు వెనుతిరిగారు.
అన్మాస్‌పల్లి, ముద్వీన్ పరిధిలో మార్కింగ్..
కడ్తాల్: మండల పరిధిలోని అన్మాస్‌పల్లి, ముద్వీన్ రెవెన్యూ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు మార్కింగ్ సర్వే బుధవారం సజావుగా కొనసాగింది. ఆర్‌వీ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడ్డారు. 330 అడుగుల రోడ్డు నిర్మాణానికి కడ్తాల్ రెవెన్యూ పరిధిలోని అన్మాస్‌పల్లిలో సుమారు రెండు కిలోమీటర్లు, ముద్వీన్ రెవెన్యూ పరిధిలో 4 కిలోమీ టర్ల వరకు సర్వే నిర్వహించి మార్కింగ్ వేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు రాజు, వహీద్, సర్వేయర్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment