రహదారులతోనే అభివృద్ధి
చేవెళ్ల: రహదారులు అభివృద్ధికి సూచికలు అని రోడ్లు భవనాలు, సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో రూ.38 లక్షలతో నిర్మించిన ప్రాథమిక సహకార సంఘం గోదాం, సొంత నిధులు రూ.40 లక్షలతో పీఏసీఎస్ చైర్మన్ డి.వెంకట్‌రెడ్డి నిర్మించి పీఏసీఎస్ భవనం ప్రారంభం, ముడిమ్యాల వద్ద ముడిమ్యాల నుంచి రావులపల్లి, మేడిపల్లి మీదుగా ప్రొద్దటూరు గేట్ వద్దకు అర్అండ్బీ నిధులు రూ.24 కోట్లతో బీటీరోడ్డుకు బుధవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. చేవెళ్ల అంటే హైదరాబాద్‌లో భాగమే అని, ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారి పనులను వారం రోజుల్లో పూర్తిస్థాయిలో మొదలు పెట్టించి ఏడాదిలోపు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదాల నివారణకు ఉమ్మడిజిల్లాలో రోడ్ల అభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయిస్తామని స్పష్టం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే దాదాపు రూ.54వేల కోట్లు వ్యవసాయ రంగం కోసం కేటాయించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీంభరత్, డీసీసీ మాజీ అధ్యక్షుడు పి.వెంకటస్వామి, టీపీసీసీ నాయకుడు జనార్దన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు డి. వెంకట్‌రెడ్డి, గోనే ప్రతాప్‌రెడ్డి, వసంతం, సురేందర్‌రెడ్డి, వీరేందర్‌రెడ్డి, దర్శన్, ఆగిరెడ్డి, బల్వంత్‌రెడ్డి, ప్రభాకర్, శైలజ, సరిత, సమత, స్వరూప, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
చేవెళ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment