‘ఫ్యూచర్ సిటీ’.. పోలీసుల పోటీ!
సాక్షి, సిటీబ్యూరో: పోలీసు వర్గాల్లో ప్రస్తుతం ‘ఫోర్త్ సిటీ’ హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించిన క్రమంలో.. శివారు ప్రాంతాల్లోని జోన్, డివిజన్ పోలీసు పోస్టులకు డిమాండ్ విపరీతంగా ఏర్పడింది. ఫోర్త్ సిటీ ప్రతిపాదనతో శివార్లలో రియల్ ఎస్టేట్ బూమ్ ఊపందుకోవడంతో ఇదే అదనుగా పలువురు పోలీసు ఉన్నతాధికారులు వారి ‘ఫ్యూచర్’ను చక్కదిద్దుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలోనే ఖాకీల బదిలీలు జరగనున్న నేపథ్యంలో ఆశావహులు ప్రభుత్వంలోని ప్రముఖులను, నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
ఖాకీలు, బిల్డర్లు.. చెట్టాపట్టాల్..
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరం ‘ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. యువత అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీ హబ్‌గా నిర్మించాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే నాలుగో నగరంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ సిటీ, మెడికల్ టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాలకు ప్రాతినిధ్యమిస్తున్నారు.
● బేగరికంచె, మీర్‌ఖాన్‌పేట, ముచ్చర్ల ప్రాంతాల్లో రానున్న ఫోర్త్ సిటీ కోసం ప్రభుత్వం ఇప్పటికే 13,973 ఎకరాల భూమిని సేకరించింది. మరో 15 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ చేయనుంది. స్థిరాస్తి నిపుణుల అంచనా ప్రకారం ఫోర్త్ సిటీ ప్రతిపాదన తర్వాత ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు 30– 40 శాతం మేర పెరిగాయి.
● ముచ్చర్ల, దాసర్లపల్లి, కడ్తాల్, నేదునూరు, కందుకూరు, మీర్‌ఖాన్‌పేట, తుమ్మలూరు, మహేశ్వరం, గూడూరు, పంజగూడ, నాగిరెడ్డిగూడ, మక్త మాదారం, ఆమనగల్లు, యాచారం ప్రాంతాల్లోని భూములకు డిమాండ్ పెరిగింది. రియల్టర్లతో పోలీసులు సత్సంబంధాలు కొనసాగిస్తారనే అభిప్రాయం ఉంది. దీంతో తమ అనుయాయులు పోస్టింగ్‌ల్లో ఉంటే స్థిరాస్తి క్రయ విక్రయాలు, తగాదాల్లో ఇబ్బందులు తలెత్తవని పలువురు బిల్డర్లు భావిస్తున్నారు.
జోన్, డివిజన్ పోస్టులకు పైరవీలు..
మహేశ్వరం మండలంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేయడంతో.. శివారు ప్రాంతాల్లోని జోన్, డివిజన్ పోలీసు పోస్టులకు డిమాండ్ ఏర్పడింది. మహేశ్వరం, యాదాద్రి– భువనగిరి, శంషాబాద్ డీసీపీలతో పాటు మెదక్, వికారాబాద్ ఎస్పీ పోస్టింగ్‌లకు ప్రాధాన్యం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా ప్రాంతాలకు కొత్త పోలీసు బాస్‌లను నియమించినప్పటికీ.. ఏడాది కాలం పూర్తవడంతో బదిలీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. దీంతో ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మహేశ్వరం జోన్ పరిధిలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం డివిజన్లతో పాటు ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) పోస్టులకు పైరవీలు తుది దశకు చేరుకున్నాయి.
ఫోర్త్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు
Õ-ÐéÆý‡$ gZ¯ŒS, yìlÑ-f¯ŒS RêMîSÌS ´ùçÜ$t-ÌSMýS$ yìlÐ]l*…yŠæ
Ð]l$õßæ-ÔèæÓ-Æý‡…, Ķæ*§é-{¨& ¿¶æ$Ð]l¯]l-W-Ç, Ôèæ…Úë-»ê-§ŠæÌSMýS$ {´ë«§é¯]lÅ…
వికారాబాద్, మెదక్ పోస్టులకూ పైరవీలు ముమ్మరం
నేతల చుట్టూ ఆశావహుల చక్కర్లు
ఫ్యూచర్‌కు డైనమిక్ ఐఏఎస్
ఫోర్త్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికలు, భారీ ప్రాజెక్టును పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇంధనం, రెవెన్యూ శాఖల్లోని పలువురు డైనమిక్ ఐఏఎస్‌లకు బాధ్యతలు అప్పగించేందుకు త్వరలోనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, సమన్వయం, పర్యవేక్షణ, భద్రత, నిర్వహణ కోసం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్), గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ తరహాలో అంతర్జాతీయ స్థాయిలో ఈ అథారిటీ కార్యాచరణ, విధి విధానాలు ఉండనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment