‘గ్రీన్‌ఫీల్డ్’ పనులను అడ్డుకున్న రైతులు
కడ్తాల్: ఓఆర్‌ఆర్ నుంచి ఫోర్త్‌సిటీ మీదుగా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి వరకు నిర్మించను న్న ఎలివేటేడ్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణ మార్కింగ్ పనులను రైతులు అడ్డుకున్నారు. ఎక్వాయిపల్లి శివారులో రోడ్డు నిర్మాణ పనులకు భూ సేకరణ కో సం రెవెన్యూ అధికారులు మంగళవారం మార్కింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల పరిధిలో భూము లు కొల్పోతున్న రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సమాచారం లేకుండా, రైతులకు నోటీసులు ఇవ్వకుండా సర్వే చేపట్టడం ఏమిటని నిలదీశారు. రోడ్డు నిర్మాణంతో ఉన్న ఎకరం, అర ఎకరం పోతే ఎక్కడికెళ్లి బతకాలి, ఎలా బతకాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సమా చారం అందుకున్న తహసీల్దార్ ముంతాజ్ అక్కడికి చేరుకున్నారు. ఇది ప్రాథమిక సర్వే మాత్రమే అని, సర్వేను అడ్డుకోవడం తగదని రైతులకు సూ చించారు. సర్వేకు సంబంధించి సమాచార నోటీసు ను ముద్వీన్ రెవెన్యూ పంచాయతీ నోటీస్ బోర్డులో అతికించామని, పత్రికల్లో ప్రకటన సైతం ఇచ్చామ ని తెలిపారు. ముద్వీన్ గ్రామ పంచాయతీలో నోటీస్‌లు అందిస్తే తమకెలా తెలుస్తుందని ఆయా గ్రామాల రైతులు వాపోయారు. ఈ మేరకు ఆ గ్రామా పంచాయతీల్లోనూ నోటీసులు అతికించాలని అధికారులకు తహసీల్దార్ సూచించారు. కార్యక్రమంలో సీఐ శివ ప్రసాద్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జర్పుల దశరథ్‌నాయక్, సింగిల్‌విండో డైరెక్టర్ జోగువీరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment