కురుమలు రాజకీయంగా ఎదగాలి
మీర్‌పేట: కురుమలు రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం పిలుపునిచ్చారు. మీర్‌పేటలో ఆదివారం జిల్లా కురుమ సంఘం నూతన సంవత్సర కేలండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కురుమలు స్థానికంగా అన్ని వర్గాలను కలుపుకొని పోవడంతో పాటు ఐక్యంగా ఉండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలని ఆకాంక్షించారు. సొసైటీలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. జిల్లాలో కురుమ సంఘం భవనం ఏర్పాటుకు స్థలం కోసం త్వరలోనే కలెక్టర్‌ను కలుస్తానని, వీలైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కురుమలకు దక్కాల్సిన వాటా ప్రకారం టికెట్లు కేటాయించాలని సీఎంను కోరినట్లు చెప్పారు. సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్దాల దశరథ మాట్లాడుతూ.. ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు రానున్న ఎన్నికల్లో కురుమల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి బండారు నారాయణ, హాస్టల్ చైర్మన్ కొలుకుల నర్సింహ, గొర్రెల కాపర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కిష్టగోని సదానందం, నాయకులు సిద్దాల బా లప్ప, సిద్దాల శ్రీశైలం, మీర్‌పేట అధ్యక్షుడు దేవరింటి వెంకటేశ్, అచ్చిని యాదగిరి, సిద్దాల జగదీశ్, మేకల ప్రశాంత్, పద్మశ్రీ, రేణుక పాల్గొన్నారు.
రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం
Comments
Please login to add a commentAdd a comment