ప్రజావాణికి 52 ఫిర్యాదులు
అర్జీలను స్వీకరించిన
అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
ఇబ్రహీంపట్నంరూరల్: ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదు దారులు బారులు తీరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన లభించింది.జిల్లా నలుమూలల నుంచి 52 ఫిర్యాదులుఅందాయని అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు. నియోజకవర్గం కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకావడం ప్రజాసమస్యలకు అద్దంపడుతున్నాయన్నారు. వివిధ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. రెవెన్యూ శాఖకు 21 ధరఖాస్తులు, ఇతర శాఖలకు 31 అర్జీలు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, మున్సిపల్ అధికారులు, మండల తహసీల్దార్లు, కలెక్టరేట్ సిబ్బంది, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
నేడు‘డయల్ యువర్ డీఎం’
షాద్‌నగర్‌రూరల్: ఆర్టీసీ అభ్యున్నతికి ప్రయాణికుల సలహాలతో పాటు సమస్యలను తెలుసుకునేందుకు మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు షాద్‌నగర్ డిపో మేనేజర్ ఉష సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 99592 26287 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.
కళాశాల నిర్మాణానికి రూ.5లక్షల విరాళం
షాద్‌నగర్‌రూరల్: ప్రభుత్వ కళాశాల నిర్మాణంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు అవ్వాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం వ్యాపారవేత్త పూర్ణచందర్ తన వంతు సాయంగా రూ.5లక్షల నగదు ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించేందుకు కళాశాల భవన నిర్మాణానికి సహకరిస్తున్న ప్రతీ ఒక్కరి ధన్యవాదాలు తెలిపారు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. అనంతరం దాత పూర్ణచందర్‌ను ఎమ్మెల్యే శాలువాతో స న్మనించారు. ఈ కార్యక్రమంలో కాశీనాథ్ రెడ్డి, తిరుపతిరెడ్డి, పురుషోత్తంరెడ్డి, బస్వఅప్ప, శేఖ ర్, శంకర్, ఖదీర్, అన్వర్, అశోక్, అప్పి, రవి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
సురక్ష సేవా సంఘం సేవలు అభినందనీయం
ఎల్‌బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్
అబ్దుల్లాపూర్‌మెట్: నిరుపేద యువత కేంద్ర ప్రభుత్వ పోలీస్ విభాగాల్లో ఉద్యోగాలు సాధించేలా తర్ఫీదునిస్తున్న సురక్ష సేవా సంఘం సేవలు అభినందనీయమని ఎల్‌బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సురక్ష సేవా సంఘం ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ తీసుకున్న పదిమంది నిరుపేద యువతలో ఎనిమిది మంది సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్ విభాగాల్లో ఉద్యోగాలు సాధించారు. దీంతో ఎనిమిది మంది యువకులు సోమవారం సురక్ష సేవా సంఘం వ్యవస్థాపకుడుకె.గోపీశంకర్‌యాదవ్ ఆధ్వర్యంలో డీసీపీ ప్రవీణ్‌కుమార్‌ను కలిశారు. ఉద్యోగాలు సాధించిన యువతతో పాటు వారికి ఉచితంగా శిక్షణను అందించిన సేవా సంఘంను అభినందిస్తూ.. దేశ రక్షణలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్‌కు
నగదు అందజేస్తున్న పూర్ణచందర్
Comments
Please login to add a commentAdd a comment