కలెక్టరేట్ ఎదుట కార్మికుల ధర్నా
● మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్
ఇబ్రహీంపట్నం రూరల్: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కిషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆయన కార్మికులతో కలిసి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డి.కిషన్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ మాట్లాడుతూ.. 2వ పీఆర్సీ ప్రకారం కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా రూ.21వేలు తక్షణమే ఇవ్వాలన్నారు. కార్మికులకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పెరుగుతోన్న పట్టణాల విస్తరణకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న స్వచ్ఛ ఆటో కార్మికుల సేవలకు గుర్తింపుగా ప్రతీ నెల రూ.10వేలు అద్దె ఇవ్వాలన్నారు. ఈ ధర్నాకు సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మద్దతు ప్రకటించారు. అనంతరం కలెక్టర్ సి.నారాయణరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రుద్రకుమార్, జిల్లా నాయకులు ఏర్పుల నర్సింహ, తులసిగారి నర్సింహ, మండల సత్యనారాయణ, పెంటయ్య, ప్రవీణ్, మున్సిపల్ కార్మిక జిల్లా నాయకులు రవి, యాదగిరి, మైసయ్య, నాగేష్, బాబు, యాదమ్మ, హంసమ్మ, పుష్పమ్మ, జ్యోతి, సులోచన, హైమావతి, ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment