గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి మార్కింగ్
ఆమనగల్లు: ఓఆర్‌ఆర్ నుంచి ఫోర్త్ సిటీ మీదుగా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి వరకు నిర్మించే ఎలివేటెడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు మార్కింగ్ పనులు ప్రారంభమయ్యాయి. 41.5కిలో మీటర్లకు రెవెన్యూ శాఖ నుంచి నోటిఫికేషన్ జారీ చేయగా సర్వే పను లు పూర్తయ్యాయి. ఆమనగల్లు, ఆకుతోటపల్లిలో రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ చేపట్టనున్నారు. ఆర్‌వీ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో సోమవారం రెవెన్యూ అధికారులు 330 అడుగుల రోడ్డు నిర్మాణానికి గా ను ఆకుతోటపల్లిలో ఇరువైపులా మార్కింగ్ ఇస్తున్నారు. సిబ్బందితో పాటు ఆమనగల్లు తహసీల్దార్ లలిత, ఆర్‌ఐ సంపత్, సర్వేయర్ రవి పాల్గొన్నారు. ఆమనగల్లు సీఐ ప్రమోద్‌కుమార్, ఎస్‌ఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్కింగ్ పనులు మరో రెండు రోజుల సమయం పడుతుందని కన్సల్టెన్సీ సంస్థ వెల్లడించింది.
పనులు ఆపేయాలని వినతి
ఈ రోడ్డు పనులు ఆపాలని సాకిబండ తండా కు చెందిన పలువురు రైతులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఆమనగల్లు తహసీల్దార్ లలితకు వినతిపత్రా లు అందజేశారు. ఈ రోడ్డు నిర్మాణంతో తమ భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశా రు. పనులను ఆపి తమకు న్యాయం చేయాలని రైతులు మనిపాల్, బోడ్య, చందర్, పాండు, రవిరాథోడ్, విజేందర్, రాజు, వినోద్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment