సాక్షి, సిటీబ్యూరో: పాత నగరంలో రెండో దశ మెట్రో పనుల్లో మరో అడుగు పడింది. రోడ్డు విస్తరణలో భాగంగా ఆస్తులు కోల్పోయిన యజ మానులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించడానికి ముహూర్తం ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. రెండో దశ కారిడార్–6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ మార్గంలో 1,100 ఆస్తులు ప్రభావితం కానున్నాయి. యజమానులు స్వచ్ఛందంగా తమ స్థలాలను మెట్రో రైలు నిర్మా ణం కోసం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 169 మంది అనుమతి పత్రాలను అందజేశారని చెప్పారు. వీరిలో 40కి పైగా ఆస్తుల యాజమాన్యానికి సంబంధించిన ధ్రువీకరణ పూర్తయిందన్నారు. తొలి దశలో ఈ 40కి పైగా ఆస్తుల యజమానులకు నష్ట పరిహారాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెక్కుల రూపంలో అందజేస్తారని తెలిపారు. ప్రభావిత ఆస్తులకు చదరపు గజానికి రూ.81,000 చొప్పున అందజేయనున్నారు. లక్డీకాపూల్లోని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment