గురుకులం.. క్రీడా సంబురం
షాద్‌నగర్: గురుకుల పాఠశాలలో నిర్వహించిన జోనల్ స్థాయి క్రీడా పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కమ్మదనం గురుకుల పాఠశాల ఆవరణలో నిర్వహించిన పోటీలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, హ్యాండ్‌బాల్, ఖోఖో, టెన్నికాయిట్, చెస్, క్యారంతోపాటు అండర్– 17, అండర్– 19 విభాగాల్లో లాంగ్‌జంప్, హైజంప్, పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మేడ్చల్, మల్కాజిగిరి, జగద్గిరిగుట్ట, చేవెళ్ల, బంట్వారం, మొయినాబాద్, శంకర్‌పల్లి, మహేశ్వరం, ఆమనగల్లు, నల్లకంచ, గౌలిదొడ్డి, నార్సింగి, కమ్మదనం, సరూర్‌నగర్ గురుకుల పాఠశాలలకు చెందిన 1,125 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో భాగంగా విద్యార్థినులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ అందరినీ ఆకట్టుకుంది. క్రీడా దుస్తులు ధరించి, జెండాలు చేతపట్టి జట్ల వారీగా మైదానంలో ర్యాలీ నిర్వహించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చిన వారిని సెల్యూట్ చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శన
అట్టహాసంగా ప్రారంభమైన జోనల్ క్రీడలు
Comments
Please login to add a commentAdd a comment