చేప పిల్లల పంపిణీలో తీవ్ర జ్యాపం
ఎమ్మెల్యే సబితారెడ్డి
తుక్కుగూడ: చేప పిల్లల పంపినీలో ప్రభుత్వం జ్యాపం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని రావిర్యాల చెరువులో సోమవారం చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. జూన్, జూలై నెలల్లోనే చేప పిల్లలను పంపిణీ చేసి ఉంటే ఇప్పటికి వాటి ఎదుగుదల ఉండేదన్నారు. ఇప్పుడు పంపిణీ చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. గత ప్రభుత్వ ంలో చేప పిల్లల పంపిణీ విషయంలో నిర్లక్ష్యం చేయలేదన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు లక్ష్మయ్య యాదవ్, కౌన్సిలర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు ఫ్యూచర్ సిటీ భూ బాధితుల సమావేశం
కందుకూరు: ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మించతలపెట్టిన 300 అడుగుల రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు మంగళవారం మండల పరిధిలోని అగర్‌మియాగూడలో సమావేశం కానున్నారు. భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతులంతా కలిసి సమష్టిగా పోరాటం చేయడానికి నిశ్చయించుకున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటలకు నిర్వహించే సమావేశానికి రైతులకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డి హాజరుకానున్నట్టు చెప్పారు. భూ బాధితులు అందరూ హాజరుకావాలని రైతులు లిక్కి జంగారెడ్డి, ఈర్లపల్లి భూపాల్‌రెడ్డి, డి.సుధాకర్‌రెడ్డి, నీరటి శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు.
పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి
కొత్తూరు: రాష్ట్రవ్యాప్తంగా అయా మున్సిపాలిటీల్లో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పర్వతాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పలువురు నాయకులు, కార్మికులతో కలిసి మున్సిపల్ కమిషనర్ బాలాజీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 20 ఏళ్లకు పైగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నప్పటికీ కొందరు కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదని అన్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో వేతనాలు సరిపోక కుటుంబ పోషణ కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో విడతల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకుడు జైపాల్‌రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.
మతం మారిన వారిని
ఎస్సీలుగా గుర్తించొద్దు
ఆమనగల్లు: ఎస్సీ కులాల నుంచి క్రైస్తవులుగా, ముస్లింలుగా మతం మారినప్పటికీ అక్రమంగా ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఉప్పల నరసింహ ఆరోపించారు. ప్రభుత్వం చేపడుతున్న కుల గణనలో మతం మారిన వారిని ఎస్సీలుగా గుర్తించొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో సోమ వారం అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఎస్సీలకు కల్పించిన హక్కులను కొందరు ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కొన్నిచోట్ల మాదాసి కురువలు ఎస్సీ రిజర్వేషన్లను అక్రమంగా పొందే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారి విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాల న్నారు. కార్యక్రమంలో ఎస్సీ పరిరక్షణ సమితి సోషల్ మీడియా కన్వీనర్ శ్రీశైలం, ఆమనగల్లు కన్వీనర్ రామాంజనేయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment